క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్న,,,

జాతీయ బేస్ బాల్ పోటీలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాలలో గత మూడు రోజులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న 34వ జాతీయ సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాయి. పోటీలను జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి హరీష్ భరద్వాజ్,ఆంధ్ర బేస్ బాల్ సంఘం సీఈవో మాధవరావు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, సుబ్బయ్య తదితరులు పర్యవేక్షించారు. లీగ్ మరియు నాకౌట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో గురువారం పోటాపోటీగా జరిగిన మ్యాచ్ లలో పురుషుల విభాగంలో చత్తీస్గడ్, ఢిల్లీ మీద 6-4, హర్యానా జట్టు కేరళపై 8-7, ఆంధ్రప్రదేశ్ జట్టు ఉత్తరాఖండ్ పై 12-0, పంజాబ్ జట్టు చత్తీస్గడ్ పై 3-1, రాజస్థాన్ అస్సాం పై 11-1  స్కోర్ ల తేడాతో విజయాలు సాధించగా, మహిళా విభాగంలో తెలంగాణ జట్టు రాజస్థాన్ పై 18-8, ఢిల్లీ జట్టు హర్యానాపై 7-2, మహారాష్ట్ర రాజస్థాన్ పై12-1, కేరళ అస్సాం పై11-0 స్కోర్లతో మీద విజయాలు సాధించారు.
ఆంధ్ర ప్రదేశ్ దేశ్, ఉత్తరాఖండ్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ కు ముందు జిల్లా ఒలింపిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, పోటీల ఆర్గనైజింగ్ కన్వీనర్ బాచం జగదీశ్వర రెడ్డి, దామోదర్ రెడ్డి  క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఓంకార క్షేత్రం శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుండి ఏర్పాటు చేసిన భోజనాల పట్ల క్రీడాకారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రధమ చికిత్స కేంద్రాన్ని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రీడాకారులకు అందుబాటులో ఉంచారు. అలాగే రాత్రి 7:30 గంటలకు  బొమ్మలసత్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు నేషనల్ బేస్బాల్ టోర్నమెంట్ సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  క్రీడాకారులు ఉత్సాహంగా క్యాంపు ఫైర్ లో పాల్గొన్నారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: