స'మత'- మ'మత'-ఏకత
సర్వమత సమ్మేళనంలో ఆసక్తికర ప్రతిజ్ఞ
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
అనాదిగా భిన్న విశ్వా సాలకూ, సంస్కృతులకు నిలయమైన మన భార తీయ వారసత్వాన్ని పరిరక్షిస్తామనీ, పరస్పర గౌరవం, మత సామర స్యంతో సామాజిక సౌహార్ద తను,సమతా ధర్మాన్ని కాపాడ తామనీ, ఇందుకు ఆవరో ధంగా నిలిచే ధోరణు లను శక్తులను నిరోధించి వసుధైక కుటుంబ స్ఫూర్తిని కొనసాగిస్తూ... శాంతి,సమైక్యతల సందేశం అందిస్తామని సమిష్టి గా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని మత బోధకులు పేర్కొన్నారు. ఇలాంటి అద్భుత మహోత్తర ఘటన విజయవాడలోని ఎమ్.బీ. భవన్ లో సర్వ మత సమ్మేళనం లో జరిగింది. సమధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు విజయ శంకర్ స్వామి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. ప్రొఫెసర్ డా.ఎంసీ.దాస్ సభను నిర్వహించారు.. హిందూ, ముస్లీం, సిక్కు, క్రైస్తవ ప్రబోధకులు, సామాజిక వేత్తలు.. పాల్గొన్నారు.
ఆ సందర్భంగా జమాఅతే ఇస్లామీ రాష్ట్ర అధ్య క్షులు మహమ్మద్ రాఫీఖ్ ఈ ప్రాతిజ్ఞను చేయిం చారు. సమత, మమత, ఏకత - కార్య క్రమాలు తెలుగురాష్ట్రల్లో విస్తరింప.. చేయాలని అందుకు అన్నీ ధార్మిక వర్గాల ప్రముఖులు, మత వర్గాల ప్రబోధకుల ను సమన్వయపర్చి కార్యచరణ రూపొందిం చాలని సదస్సు తీర్మా నించింది. శాంతి, స్నేహం, ప్రేమ, వివిధ సామాజిక వర్గాల మధ్య నెలకొనాలని.. భార తీయ ఆత్మ లౌకికత్వం, సామరస్యం మరింత బలపడాలనే సదుద్దేశంతో ఏకాబికిన 4 గంటల పాటు సాగిన ఈ సదస్సు ఆద్యంతం ప్రయోజనకరంగా కొనసాగింది.. సమాజ హితం కోసం చక్కని కార్యాక్రమం ఏర్పాటు చేసిన సమధర్మ ప్రచార పరిషత్ బాధ్యులకు సభికులు, వక్తలు అభినందించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: