మార్కాపురం జిల్లా పరిషత్ స్కూల్ లో...
అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవం
జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యములో “ అంతర్జాతీయ ఆటిజం అవగాహన దినోత్సవ సందర్భంగా దివ్యాంగులైన పిల్లలతో వారి తల్లిదండ్రుల సమక్షములో ఘనంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో బాల్యంలోనే ఎన్నోరకాలుగా అంగవైకల్యాలకు గురై మానసికంగాను, శారీరకంగాను కుమిలిపోతున్న పసిహృదయాలను, వారిని ప్రతి క్షణం నీడలావుంటూ గమనించుకుంటూ తమ కుటుంబబాధ్యతలను సైతం నిర్వహించే తల్లులకు ముందుగా నాహృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. ఆటిజం వున్న లక్షణాలున్న పిల్లలు చేసిన పనిని పదేపదే చేయడం, ఎక్కువగా అనుకరించడం వంటి లక్షణాలు కల్గివుంటారని తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి ఎమ్.రామదాస్ నాయక్ మాట్లాడుతూ ఆటిజం లక్షణాలుగల పిల్లలనుద్దేశించి వారి తల్లిదండ్రులతో ముఖ్యంగా దివ్యాంగులైన పిల్లలతో వారిలోవున్న లోపాలను వారు మరచిపోయేల వారితో మెలగాలని, అందరితో కలసి మెలిసే విధంగా అహ్లాదకరమైన వాతవరణాన్ని సృష్టించి సహకరించాలని తెలిపారు. చివరిగా దివ్యాంగులైన పిల్లలలో ఉత్సాహపరిచే విధంగా ఆటలపోటీలు నిర్వహించి గెలుపొందిన వారితోపాటు మిగతా అందరి పిల్లలకు కూడ ఎమ్.ఇ..ఓ. చేతుల మీదుగా ప్రోత్సహకర బహుమతులు అంద చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషనల్ ఉపాధ్యాయుడు వరిమడుగు వెంకటరామిరెడ్డి, స్టాఫ్ సెక్రటరీ ఎ. ప్రభాకర్ రెడ్డి, ఐ.ఇ.ఆర్.టి. లక్ష్మీదేవి, వీరారెడ్డి మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గోన్నారు.
డిప్యూటి డి.ఇ.ఓ. కిరణ్ కుమార్
మండల విద్యాశాఖ అధికారి ఎమ్. రామదాస్ నాయక్
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషాజానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: