సెమీ ఫైనల్ దశకు చేరుకున్న,,,

జాతీయ బేస్ బాల్ పోటీలు

సెమీ ఫైనల్కు చేరుకున్న మహారాష్ట్ర మహిళా జట్టు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాలలో గత నాలుగు రోజులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న 34వ జాతీయ సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు సెమీ ఫైనల్ దశకు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జట్లు సెమీ ఫైనల్ కు చేరుకోగా, మహిళల విభాగంలో ఢిల్లీ, మహా రాష్ట్ర, కేరళ రాష్ట్రాలు సెమీ ఫైనల్, దశకు చేరుకున్నాయి.

ఢిల్లీ, మధ్య ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న పోటీ

లీగ్ మరియు నాకౌట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లో శుక్రవారం పోటాపోటీగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో పురుషుల విభాగంలో తెలంగాణ గుజరాత్ పై 6-2, ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ జట్టుపై 13-1, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పై 10-3, మహారాష్ట్ర, హర్యానాపై 9-5 స్కోర్ లతేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. మహిళల  విభాగంలో కేరళ, చత్తీస్ గడ్ పై 6-3, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ పై 18-0, ఢిల్లీ, మధ్యప్రదేశ్ పై 9-0 విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాయి.

శనివారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం

మధ్యాహ్నం నిర్వహించే ఫైనల్ పోటీల తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు జాతీయ బేస్ బాల్ పోటీల బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలను ప్రధానం చేస్తారు. విజేతలకు అందించే ట్రోఫీలు, జట్టు సభ్యులకు అందించే పతకాలు, వ్యక్తిగత అవార్డులు శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల తరపున పెద్ది రెడ్డి దస్తగిరిరెడ్డి అందజేస్తున్నారు.




  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: