ప్రైవేటు టీచర్లు దరఖాస్తు చేసుకోవాలి
నెలకు రెండు వేలు, రేషన్ అందించనున్న సర్కార్
(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మళ్లీ స్కూళ్లు మూసి వేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేటు టీచర్లుకు ఆర్థిక సహాయం అందించే దిశగా ముఖ్యమంత్రి నెలకు రెండు వేల రూపాయలను, రేషన్ బియ్యాన్ని ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా తరగతులను బోధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. టీచర్లు దరఖాస్తులను తమ తమ స్కూల్లో ఇవాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు టీచర్ల కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యోచిస్తోంది. తినడానికి సరిపడా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఈ ఆర్థిక సహాయాన్ని ఖరారు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నేరుగా టీచర్ల ఖాతాలోకి డబ్బు జమఅవుతాయని తెలిపారు. ఖాతా నెంబరు, రేషన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు జతచేసి దరఖాస్తులను ఇవ్వాలని కోరారు. ఫీజుల విషయమై కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం అనంతరం ప్రభుత్వం ఫీజుల చెల్లింపు అంశంపై చర్చించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: