గడివేముల మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన,,,
నిర్వహకులపై చర్యలు తీసుకోవాలి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
గడివేములలోని స్ధానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజన నిర్వహకులు బుజ్జీ (మధు), నాగమణిలపై చర్యలు తీసుకోవాలని ఏపీ విద్యార్ధి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వేణు మాధవ రెడ్డి , ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షుడు దస్తగిరి, నాగన్న నాయకులు కోరారు. మంగళవారం నాడు వారు మాట్లాడుతూ గడివేముల మండల కేంద్రములో ఉన్నటువంటి మోడల్ స్కూల్ లో సుమారుగా 600 నుండి 700 మంది విద్యార్ధులు చదువుతున్నారనీ , ప్రభుత్వం ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకాన్ని పకడ్బందిగా అమలు చేస్తుంటే
ఈ మోడల్ స్కూల్ లో ఇందుకు భిన్నంగా కనబడుతుందని, మధ్యాహ్న భోజన నిర్వాహకులు బుజ్జీ (మధు) నాగమణి అనే వారు విద్యార్ధులకు ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, పశువులకు వండి పెట్టినట్లుగా ఈ భోజన నిర్వాహకులు చేస్తున్నారని ఆరోపించారు. మెనూను సక్రమంగా అమలు పరచకుండా, విద్యార్ధులకు సగం కడుపుకు భోజనం పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులు బుజ్జీపై గతంలో నుండి అనేక ఆరోపణలు ఉన్నాయనీ, ఎవరైన విద్యార్ధులు ఎదురు తిరిగి భోజనం విషయంలో అడిగితే గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనీ, ఈ నిర్వాహకులు అధికారులతో కూడా వాదిస్తాడన్నారు. తక్షణమే అధికారులు స్పందించి దీనిపై విచారణ జరిపి ఈ మధ్యాహ్న భోజన నిర్వహకులు బుజ్జీని తొలగించి విద్యార్ధులకు న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే విద్యార్ధులతో కలిసి గడివేముల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: