బిలాల్ నగర్ వాసుల సమస్యలు పరిష్కరిస్తా
- కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణం బిలాల్ నగర్లోని సమస్యలు పరిష్కరిస్తానని కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం బిలాల్ నగర్లో పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు. విద్యుత్ పోల్స్ పడిపోయే పరిస్థితి ఉండటంతో సంబంధిత అధికారులకు తెలియజేసారు.
ఈ సందర్భంగా ప్రజలు ఆయనతో మాట్లాడుతూ సాంకేతిక లోపం వల్ల కొందరికి రేషన్ కార్డ్స్, పింఛన్లు రావడంలేదని చెప్పడంతో సచివాలయ సిబ్బందితో మాట్లాడి సమస్య పరిస్కారం చేస్తానన్నారు. రోడ్లు, కాల్వలు సరిగా లేవని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్యామ్ మాట్లాడుతూ బిలాల్ నగర్లో సమస్యలు అధికంగా ఉన్నాయని, ప్రధానంగా పేదలు నివసించే ప్రాంతంలో రోడ్లు, కాల్వలు లేకపోవడాన్ని గుర్తించామన్నారు. రెండు విద్యుత్ స్తంభాలు పడిపోయే స్థితిలో ఉండటంతో అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లానన్నారు. సాంకేతిక లోపంతో కొందరికి పింఛన్లు, రేషన్ కార్డ్స్ రాలేదని, త్వరితగతిన రావడానికి కృషిచేస్తానన్నారు. వీరి వెంట శ్యామ్ అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: