హోమియో మందులతో... ప్రపంచంలోని,,,

ప్రజలనందరిని కోవిడ్ నుంచి  కాపాడవచ్చు

- ప్రాచీన వైద్యవిధానంతో జబ్బులు మటుమాయం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

హోమియో మందులతో ప్రపంచంలోని ప్రజలనందరిని కోవిడ్ బారినుంచి కాపాడవచ్చని రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండారు నాగేశ్వరరావు అన్నారు. డాక్టర్ సి.ఎస్.ఎఫ్. హనేమన్ 266 జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి దినోత్సవం జరుపుకుంటారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పులమాలలు వేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రాచీన వైద్య విధానంతోనే ఎన్నో జబ్బులు నయమయ్యాయని పేర్కొన్నారు. పూర్వకాలంలో హోమియో, ఆయుర్వేదం మందులు వాడారని, కాలానికి అనుగుణంగా అల్లోపతి వైద్యంపై మొగ్గు చూపుతున్నారన్నారు. గతంలో చికెన్ గున్యా వ్యాధి అల్లోపతి మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో హోమియో మందులతో నయం అయిన విషయం గుర్తు చేసారు. ప్రపంచంలోని ప్రజలనందరిని పట్టి  పీడిస్తున్న కోవిడ్ మహమ్మరిని హోమియో మందులతో నయం చేసుకోవచ్చన్నారు.
ప్రభుత్వం కోవిడ్ కు 36 వేల కోట్లు ఖర్చు పెడుతుందని, హోమియోకు ఒక శాతం ఖర్చుచేస్తే సరిపోతుందన్నారు. 72 దేశాల్లో హోమియో వైద్యులున్నారని,  ప్రజల్లో ఇమ్యూనిటీ పెంచడానికి మాత్రమే వ్యాక్షిన్ ఉపయోగపడుతుందన్నారు. ప్రధానంగా అన్ని జబ్బులకు కారణం మినరల్ వాటర్ త్రాగడమేని, బోరు నీటిని మరిగించి చల్లార్చిన తర్వాత త్రాగితే ఎలాంటి రోగాలు దరిచేరవని, నల్లనూగులు, బెల్లం తరుచూ తినడంవల్ల క్యాల్షియం పెరిగి రోగాలు దరి చేరవన్నారు. ప్రస్తుత సమాజంలో హోమియో వైద్యం వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు శశికళా రెడ్డి, చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ. రామకృష్ణా రెడ్డి, సురేష్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి, పరమేశ్వర రెడ్డి, శ్రీకాంత్, రమేష్, సురేష్, మురళీధర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: