ప్రజల దాహార్తి తీర్చడం దేవుడిచ్చిన వరం

- మూడు ప్రాంతాల్లో చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని వైకాపా  కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రెండవ పోలీస్ స్టేషన్ పక్కన, కర్నూల్ బైపాస్, ఆటోనగర్ జంక్షన్ ప్రాంతాల్లో చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో అధికంగా పనులు చేసుకుని జీవనం సాగించేవారు అధికంగా ఉంటారన్నారు.
ప్రధానంగా ఈ ప్రాంతాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉండటంతో మంచినీరు డబ్బు పెట్టి కొనాల్సి వస్తుందని, పనులు ఉన్నా, లేకున్నా వేసవికాలం కావడంతో మంచినీటికి ఇబ్బందులు పడకూడదని ఆ దేవుడే చలివేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మలికిరెడ్డి గంగా చరణ్ రెడ్డి, ద్వారం మాధవరెడ్డి, అడ్వకేట్ సుబ్బా రెడ్డి, తులసి రెడ్డి, అల్లబకష్, ఖాద్రి, వివేకానంద రెడ్డి, రాము, భాస్కర్ రెడ్డి, తిక్కరెడ్డి, సుధాకర్ రెడ్డి సిమెంట్ ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, వై.యస్. సునీల్  రెడ్డి, చంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: