పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
- ప్రభుత్వ జూనియర్ కళాశాలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
- పాణ్యం ఏపీ మోడల్ స్కూల్ కు సీసీ రోడ్డు నిర్మించాలి
- పాణ్యం ఎంపీడీవో దస్తగిరి , పాణ్యం ఎంఆర్ఓ రత్న రాధికకు ఆర్.వి.ఎఫ్ నాయకుల వినతి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
పాణ్యం మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలైనటువంటి టాయిలెట్స్ , తరగతి గదుల్లో బెంచులు, త్రాగునీరు, ల్యాబ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని , అలాగే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని కోరుతూ సోమవారం నాడు స్ధానిక ఎంపీడీఓ దస్తగిరి, ఎంఆర్ఓ రత్న రాధికలకు పాణ్యం డివిజన్ ఆర్.వీ.ఎఫ్ కమిటీ నేతలు ప్రతాప్, సుబ్బు , రియాజ్ , గురునాధ్ , సుధీర్ , నరేష్ , తదితర విద్యార్ధులు కలిసి సమష్యను వివరించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆర్వీఎఫ్ పాణ్యం డివిజన్ అధ్యక్షులు ప్రతాప్, పాణ్యం మండలనాయకులు సుబ్బు, రియాజ్, గురునాధ్లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి పాణ్యం ఏపీ మోడల్ స్కూల్ కు సీసీ రోడ్డు లేక విద్యార్ధులు స్కూల్ కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే పాణ్యం హైస్కూల్ గ్రౌండుకు కాంపౌండ్ వాల్ నిర్మించాలన్నారు. తక్షణమే పాణ్యం మండల కేంద్రములో నెలకొన్న సమస్యలును పరిష్కరించాలని వారు కోరారు.లేదంటే నిరాహార దీక్షలకు దిగుతామని ప్రతాప్ హెచ్చరించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: