ఎవరి కోసం యేసు శిలువలో ప్రాణ త్యాగం...
* సర్వ మానవాళి కోసం యేసు క్రీస్తు రక్తం చిందించాడు..
– * పాస్టర్ బి. యొహాన్ (తిరుమలయ్య)
బి. యొహాన్ (తిరుమలయ్య) జీసస్ ఫాలోవర్స్ చర్చ్ , సంస్ధ వ్యవస్ధాపకుడు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
జీసస్ ఫాలోవర్స్ “ సంస్ధ ఆధ్వర్యములో, ఫౌండర్ మరియు పాస్టర్ యొహాన్ (తిరుమలయ్య) అధ్యక్షతన తమ చర్చిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి, పేదల మధ్య అన్ని వర్గాల ప్రజలు హాజరై శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని యేసు సిలువ లో పలికిన ఏడు మాటలు పాస్టర్ బలుసుపాటి యొహాన్ మాట్లాడుతూ శిలువ మాటల పరమార్ధాన్ని వర్ణిస్తూ యేసు లోక రక్షకుడు, సర్వ పాపాలను క్షమించి నరుల శిక్షను తప్పించుటకు ఆ కరుణ మూర్తి ప్రేమమయుడు, దయ దక్షిణ్యములు కలిగిన దైవ సంభూతుడు, విశ్వ శాంతి సమాజ నిర్మాణానికి ప్రాణ త్యాగం చేశాడని వర్ణించాడు. వీరి కుమారులు క్రీస్తు గీతాలు పాడుతూ బి.శ్రీకాంత్, బి. ఈర్మీయా,బి.ప్రవీన్ మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారో విరేరుగరు గనుక వీరిని క్షమించుడి అన్న యేసు మాటను చెపుతూ… చేసిన తప్పులను ఒప్పుకున్న వారిని దేవుడు క్షమిస్తాడని మాట్లాడుతూ యేసు నిర్దోషిగా ఏ పాపం లేని వానిగా మరణమనే ముళ్ళును విరిచి మానవాళి పాపను నుంచి యేసు రక్తము ద్వారా పరలోకం వెళ్ళడానికి మార్గదర్శిగా చరిత్రలో ప్రాణాన్ని త్యాగం చేసిన దేవునిగా క్రీస్తు కొనియడబడుతున్నాడన్నారు. కృపా కాలానికి చేరుకున్న అనేక మంది భక్తులు చర్చిలో దేశ క్షేమం, ప్రజలందరూ సుఖ శాంతులతో వుండాలని, యేసు క్రీస్తు ఆశీస్సులు అందరికీ వుండాలని ఉపవాస ప్రార్థనలు చేసి, శిలువ త్యాగ మూర్తి గీతాల ద్వారా దేవుణ్ణి మహిమ మరచి, ఉపవాసం విరమించి చల్లని మజ్జిగ పానీయాలు పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషాజానో- జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: