కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణ రావు కన్నుమూత


 (జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణ రావు (87) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎమ్మెస్సార్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. ఎం.సత్యనారాయణ రావు(87) స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర. ముక్కుసూటిగా మాట్లాడుతారని ఎమ్మెస్సార్ కు పేరు. న్యాయవాద డిగ్రీ చదివి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు.. కరీంనగర్ నుంచి 1971, 1977, 1980 సంవత్సరాల్లో మూడు సార్లు గెలిచి 14 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు ఎమ్మెస్సార్. 2004-2009 వరకు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి 2004 నుంచి 2006 వరకు వై.ఎస్. క్యాబినెట్ లో దేవాదాయ, సినిమాటోగ్రఫీ మంత్రిగా సత్యనారాయణ విధులు నిర్వహించారు. 2007-2014 వరకు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ పదవిని చేపట్టారు ఎమ్మెస్సార్. గవర్నర్ కావాలన్నది తన చిరకాల వాంఛగా ఆయన చెబుతుండేవారు. వయోభారంతో 2014 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు సత్యనారాయణ. ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెస్సార్ బాధ్యతలు నిర్వహించారు. 2000-2003 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా ఎమ్మెస్సార్ పనిచేశారు.   

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: