ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఇలా వ్యవహరించండి

రంజాన్ మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ వక్ప్ బోర్డు

పవిత్ర రమజాన్ మాసం సందర్బంగా వక్ఫ్  సంస్థల నిర్వాహకులకు, ముస్లింలకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య సూచనలు చేసింది.

1.)పవిత్ర రమజాన్ మాసం సందర్బంగా మస్జీద్,ఈద్గా, దర్గా ల బాధ్యులు తమ ఆరాధనా లయాలకు వచ్చే భక్తుల ఆరోగ్య రక్షణ కొరకు అన్నిరకాల ముందు  జాగ్రత్తలు,తీసుకోవాలి.

2)రాష్ట్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇచ్చే ఆదేశాల వెలుగు లో తమ సంస్థ ఉద్యోగుల, భక్తుల ఆరోగ్యం, రక్షణ కు సంబందించిన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

3)ఆరాధనాలయాల్లో లోపలికి, వెలుపలకి వచ్చు సమయాల్లో గుంపులు గూడకుండా చూడటం,సామాజిక దూరం పాటించడం, ప్రవేశ ద్వారాల వద్ద చేతులు శానిటైజర్, సబ్బు తో శుభ్రం చేసుకొనే ఏర్పాటు చేయడం తప్పనిసరిగా నిర్వాహకుల బాధ్యత..

4)భక్తులు లోనికి ప్రవేశించే టప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కరచాలనం, ఆలింగనాలు చేయరాదు.

5)వృద్ధులు, చిన్న పిల్లలు, దగ్గు జలుబు జ్వరం తో బాధ పడుతున్న వారు మస్జీద్ ప్రాంగణం లోకి  ప్రవేశించరాదు. పై లక్షణాలు లేని ఆరోగ్యవంతులు మాత్రమే మస్జీద్ లోకి రావాలి.

6)తరచుగా మరియు ముఖ్యం గా ప్రతి నమాజ్ వేళలో మస్జీద్ నందలి నమాజ్ చేయు ప్రదేశం,వజూ ఖానా, మరుగు దొడ్లు డెటాల్, ఇతర క్రిమిసంహారకాలతో శుభ్రం చేసేలా యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి.మస్జీద్ లోని కార్పెట్లు, నీటితొట్లు శుభ్రం చేస్తుండాలి..

7)తినుబండారాలు, భోజనాలు ఏర్పాటు చేయు సమయంలో సామాజిక దూరం, పరిశుభ్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

8)ముసల్లీలు తమ ఇంటివద్దనే వజూ చేసుకొని, తమ జానిమాజ్ లను తామే తెచ్చుకోవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది.

9)మస్జీద్ ప్రాంగణం లో, పార్కింగ్ ప్రదేశం లో భౌతిక దూరపు నియమాలు పాటించేలా జాగ్రత్త వహించాలి.

పై విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని కోవిడ్ నివారణ చర్యల్ని పాటిస్తూ పవిత్ర రమజాన్ మాస ప్రార్ధనలను నిర్వహించు కోవలసినదిగా కోరడమైనది..

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్ 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: