జగనన్న భూ హక్కు భూ రక్ష శిక్షణ కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

 భూ సర్వే తో అవినీతి దళారీ వ్యవస్థకు స్వస్తి చెప్పొచ్చని తహసిల్దార్ పులి. శైలేంద్ర కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైయస్సార్ జగనన్న శాశ్విత భూ హక్కు భూరక్ష  పథకంలో భాగంగా రెండు రోజులపాటు గ్రామ సర్వే లకు విఆర్వో లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ వంద సంవత్సరాల తర్వాత చేపట్టే భూముల రీ సర్వేల విధానం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రెవిన్యూ, సర్వే, పంచాయతీ రాజ్ సంయుక్త భాగస్వామ్యంతో గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో సర్వ జరుగుతుందని వివరించారు. అత్యాధునికమైన టెక్నాలజీ పరిజ్ఞానంతో డ్రోన్, కార్స్, రోవర్ వంటి పరికరాలను ఉపయోగించి భూ స్థితి నిర్ధారణ ఖచ్చితమైన రికార్డు లు తయారు చేయబడతాయని అన్నారు. ఈ సర్వేలు చేయడం ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతుందని ప్రతి భూ భాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎస్ నరసింహులు గారు, మండల సర్వేయర్ దర్బార్ మస్తాన్ వలీ, ఆర్ ఐ. రమణ, లైసెన్స్ డ్ సర్వేయర్ రాము, మండలంలోని గ్రామ వి ఆర్ ఓ లు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: