గుర్తింపులోనూ వివక్షే,,,

అక్షరం నేర్చుకోవడం ప్రతి భారతీయుడి హక్కు

భారతీయులుగా ముస్లింలు కూడా ఇందుకు అర్హులే

ఓ సమస్యను గానీ లోపాన్ని గుర్తించినపుడే వాటిని పరిష్కరించగలం. నివారించగలం. కానీ లోపాన్ని, సమస్యను గుర్తించడాన్నే విస్మరిస్తే అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సంపూర్ణ అక్షరాస్యత ఏ దేశ ప్రగతికైనా మూలమవుతుంది. అలాంటి అక్షరం అన్నది దేశంలోని ప్రతి పౌరుడికి అందాలి. అపుడే ఆ దేశం పురోగతి సాధిస్తుంది. ఈ విషయంలో భారతీయ ముస్లింల పట్ల కొనసాగుతున్న కొన్ని చర్యలు ఏ మాత్రం సహేతుకమైనవి కావు అన్నది వారి విద్యా గణాంకాలను బట్టి ఇట్టే అర్థమవుతోంది.

ఒక సమాజ అభివృద్ధికి  విద్య అనేది అతి ముఖ్యమైనది. ముస్లింల విద్యా పురోగతిని పర్యవేక్షించడం కోసం  అధికారిక డేటా లేకపోవడం వల్ల వారి విద్య స్థితి దెబ్బతింది, దశాబ్దాలుగా ఇది విద్యారంగం లో వారి దిగజారుడు స్థితికి దారితీసింది. రతీయ ముస్లిం సమాజం విద్యాపరంగా అత్యంత వెనుకబడిన సమాజం. భారతీయ ముస్లింలపై అధికారిక విద్యా డేటా అందుబాటులో లేదు. అనుభావిక ఆధారాలు (empirical evidence) లేని, విద్యా స్థితి అపోహల మీద ఆధారపడి ఉంటుంది. ముస్లింల సాంఘిక, విద్య, ఆర్దిక స్థితి గతులపై నియమించబడిన 2006 నాటి సచార్ కమిటీ నివేదిక దీనిని నిరూపించినది. సాధారణంగా చాలా మంది ముస్లిం పిల్లలు మదర్సాల్లో చదువుతున్నారని, తద్వారా వారిలో మత వాదం ప్రోత్సహింపబడుతుందని కొందరు పథకం ప్రకారం చేపట్టిన ప్రచారంతో ఓ అపవాదు నెలకొంది. కానీ దీన్ని నిరూపణ ఎక్కడా కాలేదు. అలాంటి ఆధారాలు లేవు. 

2006 సచార్ కమిటీ నివేదిక 07 -19 సంవత్సరాల వయస్సు గల ముస్లిం పిల్లలలో కేవలం నాలుగు శాస్తం 4% మంది మాత్రమే మదర్సాలలో చదువుతున్నారని, చాలా మంది ముస్లిం విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక పాఠశాలలకు వెళ్తున్నారని  తేల్చి చెప్పింది. నమ్మిన దానికంటే చాలా తక్కువ ముస్లిం పిల్లలు మదర్సాలకు వెళ్తున్నారని ఆధారాలు/డేటాలు స్పష్టంచేస్తున్నాయి. భారతీయ ముస్లిం విద్యా స్థితిగతులపై అధికారిక డేటా లేకపోవడం వారి విద్యాభివృద్దిని పర్యవేక్షించడం లో పెద్ద అడ్డంకిగా మారింది. పర్యవసానంగా అధికారిక విద్యా డేటా విడుదల చేయబడింది, కాని అనేక ప్రభుత్వ సమాచార వనరులలో లోపాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఉదా: విద్యా విభాగం, ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ యట్ ఏ గ్లాన్స్, 2018 Compilation of the department of education, Educational Statistics at a Glance, 2018 సంకలనం పరిశిలించిన అందులో సాధారణ జనాభా డేటా,  షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కోసం విడిగా general population, and separately for Scheduled Castes (SC) and Scheduled Tribes (ST) డేటా కలదు. కాని ముస్లింలను ప్రత్యేక వర్గంగా (separate category)  మినహాయించడం జరిగింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVSకెవిఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్విఎస్NVS) నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రత్యేక నెట్‌వర్క్‌లు అందించిన విద్యార్థుల నమోదు డేటాలో ముస్లింలు  మినహాయించబడ్డారు. ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేక వర్గంగా చేర్చబడ్డారు. (Muslims have also been excluded, and SCs and STs included)

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టిNCERT) వారి  నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలలో (ఎన్‌ఐఎస్NAS) ముస్లిం విద్యార్ధులను ప్రత్యేక  వర్గంగా చూపక పోవటం స్పష్టంగా కనిపిస్తున్నది. మూడవ, ఐదవ తరగతులలో భాష, గణితం, పర్యావరణ అధ్యయనాలలో సుమారు 2.2 మిలియన్ల విద్యార్థుల అభ్యాస ఫలితాలను ఇటీవలి 2017 NAS అంచనా వేసింది. 7వ తరగతిలో సామాజిక అధ్యయనాలు, విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ అధ్యయనాలను పరీక్షించింది. మునుపటి ప్రచురణల మాదిరిగానే, అభ్యాస డేటాను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విడిగా అందించారు. ఇప్పుడు ఇతర వెనుకబడిన తరగతులను (ఓబిసి) కూడా చేర్చగా, NASనాస్ నివేదిక ముస్లింలను దాని పరిధి నుండి మినహాయించింది excluded Muslims.

ఈ రకమైన అభ్యాస డేటా ద్వారా  ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు  స్వాతంత్య్రానంతరం సాధించిన విద్యా ప్రగతి ని పోల్చడం ద్వారా, నమోదు/ఎన్రోల్మెంట్, ఇతర గణాంకాల యొక్క ప్రాముఖ్యత హైలైట్ అవుతుంది. కలోనియల్  భారతదేశంలోని విద్యా గణాంకాలు పాఠశాల, ఉన్నత విద్య యొక్క అన్ని స్థాయిలలో విద్యా ఎన్రోల్మెంట్ లో ఎస్సీలు, ఎస్టీల కంటే ముస్లింలు చాలా ముందున్నారని సూచించింది.

అయితే, స్వాతంత్య్రానంతర భారతదేశంలో ముస్లింల మాదిరిగా కాకుండా ఎస్సీలు, ఎస్టీలు విద్యా పురోగతి సాధించారు. ఎస్సీలు, ఎస్టీలపై డేటా లభ్యత వారి కోసం ప్రత్యేక విద్యా పథకాలను ప్రారంభించడానికి అనుమతించింది. జాతీయ, రాష్ట్ర ప్రణాళికలు, ప్రభుత్వ సంస్థలు వారి పరిమాణాత్మక, గుణాత్మక పురోగతిని తెలుసుకోవడానికి వివిధ రకాల విద్యా సూచికలను ఉపయోగించాయి, తద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకొన్నారు.

మరోవైపు, ముస్లింల విద్యా పురోగతిని పర్యవేక్షించడం కోసం అధికారిక సమాచారం లేకపోవడం వల్ల వారి పరిస్థితి దశాబ్దాలుగా దిగజారింది. అధికారిక విద్యా గణాంకాలు, ముస్లింలపై 2001 జనాభా లెక్కల డేటా చివరకు బహిరంగంగా అందుబాటులోకి వచ్చినప్పుడు, వారి విద్యా తులనాత్మక క్షీణత యొక్క నిజమైన పరిధి వెల్లడైంది. ముస్లింలు భారతదేశంలో విద్యాపరంగా వెనుకబడిన సమూహంగా ఉన్నారు. వారి జనాభాతో పోల్చితే, వారు ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఉన్నత మాధ్యమిక పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యలో అతి తక్కువ నమోదు రేట్లు కలిగి ఉన్నారు. ముస్లింలు విద్యాపరంగా వెనుకబడినవారని అధికారిక విద్యా గణాంకాలు దాదాపు ఒక దశాబ్దం పాటు వెల్లడించినందున, ముస్లింల  విద్యా గణాంకాలు ముఖ్యంగా KVS, NVS మరియు NCERT గణాంకాలు  అసమంజసమైనవి. ఇటీవలి పాఠశాల మరియు ఉన్నత విద్య నివేదికలు - జిల్లా సమాచార వ్యవస్థ, ఉన్నత విద్యపై ఆల్ ఇండియా సర్వే - ముస్లింలపై డేటాను అందిస్తున్నప్పటికీ, అవి  సమగ్రమైనది కావు.

దీనికి పరిష్కారంగా ఇప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి..?

మొదట, జనాభా గణనతో సహా అన్ని అధికారిక ప్రచురణలను సమీక్షించాలి. ఎస్సీలు, ఎస్టీలకు అందుబాటులో ఉన్న విధంగా  ముస్లింలపై కూడా డేటాను ప్రచురించాలి. ముస్లిం విద్యార్థుల విద్యా పురోగతిని, అన్ని దశలలో, పాఠశాల మరియు ఉన్నత విద్య యొక్క నెట్‌వర్క్‌ లను గుర్తించడంలో సహాయపడే అన్ని కేంద్ర, రాష్ట్ర నివేదికలలో నమోదు, అభ్యాసం, పరీక్షా ఫలితాలు, సౌకర్యాలు/ స్కాలర్‌షిప్‌లను అందించడం వంటి గణాంకాలు ఇందులో ఉండాలి.. డేటా రిపోర్టింగ్‌లో యునిసెఫ్, యునెస్కో, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూడా దీనిని అనుసరించాలని కోరాలి. ముస్లింలు, అన్ని ఇతర మత మైనారిటీల డేటాను విడిగా నివేదించాలి. "మైనారిటీ లేదా మైనారిటీలు" అనే పదం ముస్లింలను మాత్రమే సూచిస్తుందా లేదా అన్ని మతపరమైన మైనారిటీలను సూచిస్తుందా అనేది స్పష్ట పరచాలి. ఇది అస్పష్టతను నివారించడానికి సహాయపడుతుంది. భారతీయ ముస్లింలు ఇప్పుడు 200 మిలియన్లకు దగ్గరగా ఉన్నారు. జనాభాలో దాదాపు 15% ఉన్నారు. నిరంతరవిద్యా ప్రగతి మాత్రమే ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను మెరుగు పరచగలదు. భారతీయ ముస్లింలపై సమగ్ర డేటా వారి సమగ్ర అభివృద్దికి తోడ్పదగలదు., అది వారి విద్యా పురోగతిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ 

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: