జగన్ నియంతృత్వ పాలనను సాగనంపండి
- సీపీఐ అభ్యర్థులను గెలిపించండి
- సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు
మాట్లాడుతున్న రామాంజనేయులు, పాల్గొన్న రసూల్, బాబా తదితరులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
జగన్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నాడని, ఆయనను సాగనంపెందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు పిలుపునిచ్చారు. నంద్యాలలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో సీపీఐ అభ్యర్థులు ఎంపిటిసి, జెడ్ పిటిసి స్థానాల్లో పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆళ్లగడ్డ ప్రాంతంలో పెద్దబోధనం గ్రామంలో ఏఐవైఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు ఎంపిటిసి అభ్యర్ధిగా, అలాగే రుద్రవరం మండలం పెద్ద కంబలురు గ్రామంలో సీపీఐ అభ్యర్థి పోటీల్లో నిలిచారని, వారిని గెలిపించాలని కోరారు. నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామాలతో పాటు అందరు అభివృద్ధి చెందుతారన్నారు. ప్రజలు ధన రాజకీయాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్ రసూల్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బాబాపకృద్దీన్, ఏఐఎస్‌ఎప్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు, రైతు సంఘం జిల్లా నాయకులు సోమన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: