వైసిపితోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం

మునిసిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ


మార్కాపురంమునిసిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఛైర్మన్ మురళీకృష్ణ స్పష్టంచేశారు. స్వాతంత్ర్య సమరయోధులు జగ్జీవన్ రాం జయంతి వేడుకల సందర్భంగా పట్టణ మునిసిపల్ కార్యలయములో ని కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రాం జయంతి కార్యక్రములో మాట్లాడుతూ...మహనీయులు జగ్జీవన్ రాం  స్వాతంత్ర్య సమర యోధునిగా  సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారని  పేర్కొన్నారు.

స్వరాజ్య ఉద్యమంతోనే తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంలో సైతం జగ్జీవన్‌రామ్‌ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌లు ఆనాడే పునాదులు వేశారన్నారు.అంబేద్కర్, జగ్జీవన్ రామ్ కలలు గన్న సమసమాజం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తోందన్నారు.అంబేద్కర్‌ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు, కానీ చేతల్లో చూపించే వారుండరు అలాంటిది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అంబేద్కర్‌ ఆశయాలను నెరవేరుస్తున్నారనితెలిపారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రులుగా సైతం అవకాశం కల్పించారని గుర్తు చేశారు.మహోన్నత వ్యక్తి  జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలి ఆయన పిలుపునిచ్చారు. చివరిగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కార్యలయ సిబ్బందితో పాటు కౌన్సిలర్లు యమ్ సిరాజ్ భేగ్,       డి హర్షిత బాబీ, క్రొత్త క్రిష్ణ,            వై నారాయణరెడ్డి, కె నగేష్, వైసీపీ నాయకులు గుంటక చెన్నారెడ్డి,  యమ్ వెంకట రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: