నంద్యాలలో కూరగాయల మార్కెట్ గేట్ల వేలం పాటలు
- 72 లక్షలకు దక్కించుకున్న మునావర్
వేలం పాటలో పాల్గొన్న కమిషనర్, వైస్ చైర్మన్, అధికారులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)నంద్యాల పట్టణం కూరగాయల మార్కెట్ గేట్ల వేలం పాటలు ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, వైస్ చైర్మన్ గంగిశెట్టి సమక్షంలో వేలం పాటలు జరిగాయి. వేలం పాటల్లో కరిముల్లా, ఆర్షద్ హుస్సేన్, మునావర్ లు పాల్గొన్నారు. వేలం పాట గతంలో పాడిన 52 లక్షల నుంచి మొదలు పెట్టడంతో వేలం పాటదారులు నెమ్మదిగా పాట మొదలు పెట్టారు. చివరికి 72 లక్షలకు మునావర్ పాడి వేలం పాటలు దక్కించుకున్నారు. వేలం పాట 72 లక్షలతో పాటు జిఎస్టీ, శానిటేషన్ అదనం. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్లు సాదిక్, ఆరిఫ్ నాయక్, కలాం, మునిసిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు అజీమ్, కలాం తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు దక్కించుకున్న మునావర్
పాల్గొన్న కాంట్రాక్టర్లు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: