ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో

రూ.2కోట్ల75 లక్షలతో నూతన భవనాలు

-  భూమి పూజచేసిన ఎంపీ పోచా,  ఎమ్మెల్యే శిల్పా రవి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో 2కోట్ల75 లక్షలతో నిర్మించనున్న12 నూతన భవనాలకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు భూమి పూజ చేశారు. ఆర్డీటీ పుష్ప దాదాపు 2కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవనాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పునర్నిర్మాణం ఈ రోజు  విన్సెంట్ ఫెర్రర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ డి టి సహకారంతో 12 నూతన గదులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కళాశాలలో గదులు ఇబ్బందికరంగా ఉండి విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంతో ఆర్ డి టి సంస్థను సంప్రదించడం జరిగిందన్నారు.  విద్యార్థుల సమస్యలను గుర్తించి ముందుకు వచ్చి 2.కోట్ల50 లక్షల రూపాయలతో 12 నూతన గదులను కట్టిస్తామని చెప్పడం జరిగిందన్నారు.
నంద్యాల కు ఇది ఒక శుభసూచకమని, ముఖ్యంగా మహిళా విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక మధ్యలో చదువు మానివేసి  ఉండేవారని, అలా ఉండకూడదని ఉద్దేశంతోనే ఆర్ డి టి సంస్థ సంప్రదించి 2.కోట్ల50 లక్షల రూపాయలు, ఎంపీ, ఎమ్మెల్యే, నవ నిర్మాణ సంస్థ సుగుణ కుమార్ కళాశాల సిబ్బంది కలిసి  17 లక్షల రూపాయ లు ఇవ్వడం జరిగిందని అన్నారు మిగిలిన ఎనిమిది లక్షల రూపాయలను త్వరలోనే పూర్తి చేసి అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి,  సాయి రామ్ రెడ్డి , ప్రతాపరెడ్డి, సురేష్ పాల్, ప్రసాద్, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: