సామాజిక సేవకుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు,,,

తెలుగు తేజం ఎక్స్ లెన్సీ 2021జాతీయ పురస్కారం 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సామాజిక సేవకుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు తెలుగు తేజం ఎక్స్ లెన్సీ 2021జాతీయ పురస్కారం వరించింది. అక్షర దీక్ష సాహిత్య కళావేదిక తెలంగాణా. ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర. కర్ణాటక పీవీ నరసింహారావు అభిమాన సంఘాలు నిర్వహించాయి హైదరాబాదు లోని పివి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 12 రంగాలలో విశిష్ట సేవలందించిన తెలుగు  వారికి మన తెలుగు తేజం జాతీయ అవార్డుల పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2:30 గం.లకు హైదరాబాద్ లో బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో ఘనంగా జరిగిందిఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా సాహితీవేత్త .బహుముఖ ప్రజ్ఞాశాలి.వేణు సంకోజు గారు ముఖ్య అతిథులుగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి కుమారుడు పీవీ. ప్రభాకర్ రావు గారు.పీవీ మదన్ మోహన్ గారు.పీవీ కశ్యప్.ఎస్ వీ సుభాష్ పీవీ నరసింహారావు కుటుంబీకులు ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు సామాజిక సేవకుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు భారతీయ సాంప్రదాయ మేళ తాళాల మధ్య వందలాది ప్రేక్షకుల మధ్య ఘనంగా సన్మానించి
  మన తెలుగు తేజం ఎక్స్ లెన్సీ పురస్కారం అందజేశారు. ఈ   కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ జాతీయ -2021పురస్కారం అందుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం ఉదయ్ లైఫ్ వరల్డ్ సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ  శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా  జాతీయ స్థాయిలో  ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.2021రాష్ట్ర స్థాయి మదర్ థెరిస్సా పురస్కారం.
వేదిక తెలుగు నంది  జాతీయ పురస్కారం 2021ఢిల్లీ లో భగవాన్ బుద్ధ ఎక్స్ లెన్సీ జాతీయ పురస్కారం వందకు పైగా పురస్కారాలుఅందుకున్నా రు పీడిత సామాజిక వర్గాల తో ఐక్యఉద్యమాలు.అణగారిన వర్గాలకు బాసటగా.దళిత ఉద్యమాలలో  దళిత ముస్లిం గా ముందుకు వెళ్తూ   ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ఉద్యమ కారులు  రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు.




 









 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: