సిటీ సివిల్ కోర్టులో...
ఈ నెల 19, 20 తేదీలలో వాక్సినేషన్
న్యాయవాదులు వినియోగించుకోవాలి
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా ప్రభావం తీవ్రతరం దృష్ట్యా ఈ నెల 19, 20 తేదీలలో న్యాయవాదులకు వాక్సిన్ టీకాలు అందించనున్నట్లు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన కార్యదర్శి ఈ. కిషోర్ కుమార్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కోర్టుల్లో కేసులు వాదించే దిశలో న్యాయవాదులు నిమగ్నమై ఉండటంవల్ల వాక్సిన్ టీకాలు వకీళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా కరోనా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. మాస్క్ లు, భౌతిక దూరాన్ని, షానిటైజ్ లను తప్పక వాడాలని సూచించారు. కరోనా జాగ్రత్తలను పాటించడం వల్ల కరోనా ప్రభావం బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదని చెప్పారు. వాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు
న్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: