విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి

- విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంపిణీ

- 16వ వార్డు కౌన్సిలర్ విజయ భాస్కర్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సేవచేసే గుణం ఉండాలి,  సమాజంలో పేద విద్యార్థులకు సహాయం అందిస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని భావించిన కౌన్సిలర్ విజయభాస్కర్ విద్యార్థులకు ఉడుతా భక్తిగా పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. నంద్యాల 16వ వార్డుకు చెందిన కౌన్సిలర్ విజయ భాస్కర్ మహానంది మండలం గాజులపల్లి ఆర్.ఎస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు  108 మందికి పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా పేదవారు ఉంటారని, అటువంటి వారికి సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రతిఒక్కరు ఏడాదికి ఒక్కసారైనా తమకు తోచిన విధంగా పేద విద్యార్థులకు సహాయం చేస్తే వారి ఉన్నతికి తోడ్పడిన వారవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: