కామ్రేడ్ లెనిన్ 152వ జయంతి
ఘనంగా నిర్వహించిన నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ లెనిన్ 152వ జయంతి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 53 సంవత్సరాల ఆవిర్భవించిన సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం నందు పార్టీ జెండాను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు ఏం.శంకర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.శంకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 22న మహోపాధ్యాయడు కామ్రేడ్ లెనిన్ 152 వ జయంతి ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలను ప్రపంచంలోని మొట్టమొదటి సోషలిస్టు రాజ్య స్థాపనకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుందాం.
సోషలిస్టు రాజ్యస్థాపానకు ముందు ఆయన కార్మికవర్గ పార్టీ నిర్మాణం కొరకు చేసిన పోరాటాన్ని రెండవ ఇంటర్నేషనల్ రివిజనిజానికి రష్యాలో మెస్సి లిజనికి వ్యతిరేకంగా సాగించిన రాజకీయ సిద్ధాంత పోరాటాలను మరోసారి నెమరు వేసుకుందాం అని ఆయన అన్నారు. అదేవిధంగా అక్టోబర్ సోషలిస్ట్ విప్లవ నేపథ్యంలో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఆవిర్భవించి నూరు వసంతాలు నిండాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కార్మికులు కర్షకులు అశేష ప్రజానీకం సామ్రాజ్యవాదానికి బడా బూర్జువా భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో అనేక ఆటుపోట్లకు గురైన్నారు. పార్టీలో రివిజనిజం అతివాదం మితవాదులు తలెత్తి విప్లవ ప్రజా ఉద్యమాలకు ఎనలేని నష్టాలు కలిగించాయి అని అన్నారు.
సిపిఐ రివిజనిజనికి సిపిఎం నాయ రివిజనిజానికి వ్యతిరేకంగా రాజకీయ సిద్ధాంత పోరాటంలో నక్సల్బరి వసంత మేఘ గర్జన నేపథ్యంలో భారత విప్లవకారులు 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆవిర్భవించి నేటికి 53 సంవత్సరాల వసంతంలోకి అడుగు పెట్టింది. అతివాద మితవాద రివిజనిజం కలిగిస్తున్న నష్టాలను క్లుప్తంగా గుర్తు చేసుకొని గుణపాఠాలు నేచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై నరసింహులు, ఐ ఎఫ్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె .అరుణ్ కుమార్ భారత రైతుకూలీ సంఘం జిల్లా కోశాధికారి ఎం. గోపాల్, పీడీఎస్ యూ శేఖర్ నాయుడు, పీవైఎల్ జిల్లా నాయకులు యూ.నవీన్ కుమార్, ఐఎఫ్ టియు నాయకులు గోవిందు, మద్దిలేటి కంపన్న తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: