డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని

రాజ్యం హక్కుల పరిరక్షణ దినంగా పాటించాలి

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి డి కే జి రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు వై నరసింహులు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అగ్రగామి పాత్రని నిర్వహించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి దక్కింది నిర్వహించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి దక్కింది ఆయన కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేడు ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు లౌకిక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి దేశంలో నెలకొని ఉంది రాజ్యాంగ ప్రాతిపదికగా పరిపాలన సాగించాల్సి ఉండగా ఆచరణలో ఇప్పటికే  మన వాదాన్ని తెర వెనక నుండి అమలు చేసినా పాలకులు బాహు తంగ దౌర్జన్యంగా మనువాద కార్పొ రెట్ పాసిజం గా అమలు చేస్తున్నారు
మనువాద భావజాలంతో దేశభక్తి జాతీయత గోమాత అయోధ్యలో రామాలయ నిర్మాణం లాంటి నినాదాలు వైపు ప్రజల మనసులను మళ్లించి వ్యవసాయాన్ని పారిశ్రామిక రంగాన్ని సకల దేశ వనరులను శ్రమ శక్తిని విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టడానికి పూనుకున్నది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వ రంగాన్ని సంపూర్ణంగా ప్రైవేటీకరించడం ద్వారా ఆచరణలో రిజర్వేషన్లను కూకటివేళ్లతో పెకలించి రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది కావున రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఉద్యమించాలన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి ఎం  గోపాల్ పీ వై ఎల్ జిల్లా నాయకులు యు నవీన్ కుమార్ ఐ ఎఫ్ టి యు డివిజన్ అధ్యక్షులు శ్రీ తిక్కయ్య మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందు సత్య రాజు తిమ్మయ్య బాలయ్య ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: