రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో,,,

ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించాలి.. 

ఖమ్మం జిల్లా ఎం.పి.జె. అధ్యక్షులు ఎస్.కే.ఖాసిం డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించాలి ఖమ్మం జిల్లా ఎం.పి.జె. అధ్యక్షులు ఎస్.కే.ఖాసిం డిమాండ్ చేశారు. ఆదివారంనాడు స్థానిక మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కార్యాలయములో జరిగిన విలేఖరుల సమావేశములో జిల్లా ఎం.పి.జె అధ్యక్షులు ఎస్.కె. ఖాసిం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఖమ్మం నగరంలో ముస్లిం మైనారిటీలు 17 శాతం కంటే ఎక్కువ వున్నారని, కావున రాబోవు  నగర కార్పొరేషన్ ఎన్నికలలో 12% కంటే ఎక్కువగా మైనారిటీ లకు సీట్లు కేటాయించి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ కూడా ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ముస్లిం మైనారిటీలకు కార్పొరేషన్ ఎన్నికలలో అధిక సీట్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎం.పి.జె సభ్యులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: