పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి

- ఏప్రిల్‌ 10న జీఓ కాపీలు దగ్దం

తెలంగాణ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కేంద్ర మోడీ ప్రభుత్వం ఎరువుల ధరలు భారీగా పెంచడం దారుణమని, జీఓ ప్రతులను జిల్లా, మండల కేంద్రాలలో ఏప్రిల్‌ 10న దగ్దం చేయాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎరువుల ధరలు కేంద్ర ప్రభుత్వం దారుణంగా పెంచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. డిఏపి 50 కేజీల బస్తా పాత ధర రూ.1200 ఉండగా రూ.1900కు పెంచారు.
50 కేజీల బస్తాకు ఒకేసారి రూ.700 పెంచడం రైతులు మోయలేని భారంగా తయారు అవుతుందని అన్నారు. పోటాస్‌ ధర రూ.875 నుండి రూ.1000, మరియు 28-28-0 ఎరువును రూ.1350 నుండి రూ.1700కు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పంటకు 16 లక్షల టన్నులు వినియోగిస్తాం. రైతులపై 58శాతం ధరలు పెంచడంతో మోయలేని భారం పడింది. మరో వైపున కనీస మద్దతు ధరలు పెంచకపోగా, నిర్ణయించిన ధరలు అమలు జరగడంలేదు. రైతు పెట్టుబడిరాక మరింత నష్టపోతారు.రైతుల ఆధాయం రెట్టింపు చేస్తానన్న మోడి ప్రభుత్వం రైతుల సమస్యలను రెట్టింపు చేస్తుంది. ఒకవైపు 137 రోజులుగా రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణాలు మాఫీ చేయాలని డిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా, రైతులను నష్టపరిచే విధంగా ఎరువుల ధరలను పెంచడం అత్యంత దుర్మార్గం. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజలు ఆందోళనలు కొనసాగించాలని సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఈ కార్యక్రమంలోతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, జయరాజు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: