తక్షణం రూ.1లక్ష వడ్డీ లేని రుణం ఇవ్వాలి
ఆపై లాక్ డౌన్ పై ఆలోచన చేయాలి
వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహ్మద్ డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)
కరోనా సెకండ్ వేబ్ నేపథ్యంలో లాక్ డౌన్ గురించి ఆలోచన చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు రూ.1లక్ష వడ్డీ లేని రుణం అందించి ఆ దిశగా అడుగులు వేయాలని వెల్పేర్ పార్టీ ఆప్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం.అహ్మద్ డిమాండ్ చేశారు. అపుడు లాక్ డౌన్ చేసినా సముచితంగా ఉంటుందన్నారు. గతంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావన్నారు. వడ్డీలేని లక్ష రూపాయల రుణం అందించాక లాక్ డౌన్ చేసినా ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, టూ విల్లర్, ఫోర్ విల్లర్ గుర్తింపు కార్డులతోపాటు నైపుణ్య రంగాలలో ఉన్న వారి వారి సంబంధిత ఐడెంటీ కార్డుల ద్వారా ఈ వడ్డీలేని రుణం అందించాలన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి వడ్డీ లేని రుణం ప్రజల ఖాతాలో జమా చేశాక అపుడు లాక్ డౌన్ గురించి ఆలోచన చేయాలని ఆయన సూచించారు. అపుడే లాక్ డౌన్ సంపూర్ణంగా జరిగి ప్రజలకు ఇబ్బందులకు గురికాకుండా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: