ఏప్రిల్ 2021

 కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ బాషా డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో బియ్యం కేంద్ర ప్రభుత్వం పంపిణి చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ టెస్టింగ్ పరీక్షలు వాటి ఫలితాల మధ్య సమయం చాలా పడుతోందని ఆయన అన్నారు.  ఇది కూడా కోవిడ్ విస్తరణకు కారణంగా ఆయన పేర్కొన్నారు. టెస్టింగ్ ఫలితాలు వెంటనే వస్తే కరుణ కట్టడికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  అర్బన్ హెల్త్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇస్తోందని వాటి ద్వారా రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టాలని ఆయన సూచించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 కోవిడ్ టీకాకు ముందే రక్తదానం చేద్దాం

ముస్లిం నగరా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన రక్త దానం చేద్దాం కోవిడ్ టీకాకు ముందే రక్తదానం చేద్దాం అనే కార్యక్రమం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కోవిడ్ టీకాకు ముందే రక్తదానం చేద్దాం కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత దాదాపు 50రోజుల వరకు రక్తదానం చేయకూడదు అని వైద్యులు అంటున్నారని కోవిడ్ మహమ్మారి సమయంలో రక్తం కొరత తీవ్రంగా ఉందని ప్రతి ఒక్క ఆరోగ్యవంతులు రక్తదానం చేసి సహకరించాలని ప్రాణదాతలుగా మారాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలో 4.5కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా భారతదేశంలోమూడు కోట్ల యాభై లక్షల మంది తలసీమియా మహమ్మారి తో బాధ పడుతున్నారని ప్రతి 20రోజులకు రక్తం దాతల ద్వారా దొరకక పోతే మరణమే శరణ్యమని ప్రతి 18సంవత్సరాలనుండి 55సంవత్సరాల ఆరోగ్యవంతులు బ్లడ్ బ్యాంక్ రక్త నిధి కి వెళ్లి స్వచ్ఛoదంగా రక్తదానం చేసి కోట్లాది తలసీమియా బాధితుల కు ప్రాణదానం చేయవలసిన బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు స్వచ్చందంగా తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తనిధి కి వచ్చి రక్తదానం చేసిన షేఖ్ సనావుల్లా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో .టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షబ్బీర్.టిప్పు సుల్తాన్ రక్తదాన సంఘం పట్టణ అధ్యక్షులు  తదితరులు పాల్గొని రక్తదాతలకు అభినందించారు.




 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 పోలీస్ కుటుంబాల సంక్షేమంకోసం

కొవిడ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

కోవిడ్ సమయంలో పోలీస్ సిబ్బంది, పోలీస్ కుటుంబాల సంక్షేమంకై కార్పొరేటు హాస్పిటల్   వసతులతో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ప్రారంభించారు. శుక్రవారంనాడు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా ఏర్పాటుచేసి  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఐ.పీ.ఎస్. ప్రారంభించినారు. కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా పోలీసు సిబ్బంది, పోలీస్ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లుగా ఎస్పీ గారు తెలియచేసినారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న దృష్ట్యా పోలీసు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకొన్నామని, ఎవరైనా పోలీసు సిబ్బంది కరోనా వ్యాధి ప్రభావానికి గురైనట్లుయితే వారికి తక్షణ వైద్య సదుపాయం అందించనున్నట్లు తెలియచేసినారు. కరోన వ్యాధి లక్షణాలు ఉన్న  పోలీసు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులకు తక్షణమే కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించి, పాజిటివ్ అని తెలిసిన వెంటనే త్వరితగతిన వైద్యం అందేలా చర్యలు చేపట్టిన్నామని తెలియచేసినారు.
పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈ కోవిడ్ కేర్ సెంటర్ అందుబాటులో వుండే విధంగా 45 సాధారణ పడకలు+ 10 ఆక్సిజన్ పడకలు మొత్తం:55 పడకలతో మహిళకు మరియు పురుషులకు ప్రత్యేకమైన బ్యారక్ లతో ఈ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. సిబ్బందికి మానసిక ఉల్లాసాన్ని కల్పించి వారిలో మనో ధైర్యాని నింపడానికి టెలివిజన్ లను మరియు ఇంటర్ నెట్ సదుపాయాలను ఈ బ్యారక్ లలో కల్పించిన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేయుటకై తగిన ఏర్పాటుచేసినారు. పోలీస్ సిబ్బంది కోవిడ్ కు సంబంధించి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్న యెడల డిటిసి నందలి కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్: 9121102270 కు సమాచారం అందించి, తక్షణ సహాయం పొందాలని తెలియచేసినారు. కోవిడ్ కేర్ సెంటర్ నందు ప్రత్యెక రిసెప్షన్ ను ఏర్పాటు చేసినట్లు, అదే విధంగా డిటిసి నందు కోవిడ్ బారిన పడిన సిబ్బందికి  24/7  అంబులెన్స్ సదుపాయం ఉంటుదని పేర్కొన్నారు. అదే విధంగా కోవిడ్ కేర్ సెంటర్ నందు వైద్య సదుపాయం పొందుచున్న సిబ్బంది మరియు కుటుంబ సభ్యులకు మూడు పూటల  ప్రతి రోజు పౌష్టికాహారంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేందుకు డ్రై ఫ్రూట్స్ ను అందించేందుకు చర్యలు చేపట్టినామని, శానిటైజర్లు, మాస్క్ లు, థర్మల్ స్కానర్స్ ను ఏర్పాటుచేసినామని ఎస్పీ తెలియజేశారు. కోవిడ్ కేర్ సెంటర్ నందు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందరూ మూడు షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంటారని, అదేవిధంగా కోవిడ్ సోకిన సిబ్బందికి కావలసిన వైద్య పరికరాలు, మందులు అన్ని అందుబాటులో ఉంటాయని, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న సిబ్బందికి అన్నివేళలా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకై తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 
అదే విధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ కి ఇన్చార్జిగా ఉన్న డీటీసీ, డీఎస్సీ జి.రామకృష్ణ డిటిసి లో వున్న కోవిడ్ బారిన పడిన సిబ్బందిని 24/7 పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషల్ ఎస్పీ (అడ్మిన్) బి.రవిచంద్ర, డీటీసీ డిఎస్సీ జి.రా

మకృష్ణ, డీఎస్బీ డీఎస్సీబి. మరియదాసు, ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్,దిశ డిఎస్సీ యం.ధనుంజయుడు, ఎఆర్ డిఎస్పీ కె.రాఘవేంద్రరావు, ఒంగోలు పీటీసీ డాక్టర్ డి.మానస, ఎస్బి-1 సీఐ వి.సూర్యనారాయణ, డీటీసీ సీఐ యం.శ్రీనివాసరావు, కమాండ్ కంట్రోల్ స్పెక్టర్ ఆర్.రాంబాబు, తాలూకా సిఐ శివరామ కృష్ణ రెడ్డి, ఆర్ఐ లు జె.హరి బాబు, బి.శ్రీకాంత్ నాయక్, సీహెచ్.సుబ్బారావు, జి.శ్రీహరి బాబుగారు, డీటీసీ అర్ఐ వెంకటేశ్వర రావు, డాక్టర్లు, నర్సులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

 

 కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మయం

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. తాము నోరూ కడుపు కట్టుకుని అవినీతి రహిత పాలన అందజేస్తున్నామనే ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించడం ఆయన ప్రభుత్వ అవినీతి రహితం కాదనడానికి ఇదే నిదర్శనమన్నారు. వందల కోట్లు కూడబెట్టిన వారిపై కూడా విచారణ జరుపాలని మంత్రి ఈటెల రాజేంద్రప్రదేశ్ కోరడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో అగ్రిగోల్డ్ బాధితులు 20 లక్షల మంది కుమిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటామని హామీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నారు. కానీ కేవలం రూ.240 కోట్లు మాత్రమే విడుదల చేసి రూ.10,వేల లోపు బకాయిలున్న వారికే చెల్లించారని ఆయన పేర్కొన్నారు. ఇతర బాధితులకు మాత్రం ఇటువంటి సాయం చేయకుండా విస్మరించడం శోచనీయం అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణ న్యాయం చేసేలా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 ఆ ప్రైవేటు  ఆసుపత్రులను సీజ్ చేయాలి... 

 ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు యు.నవీన్ కుమార్ డిమాండ్ 


(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ పేషంట్ల నుండి అధిక ఫీజులు డిపాజిట్ చేయించుకున్న ప్రయివేట్ హాస్పెటల్ యాజమాన్యల అక్రమాలను అరికట్టి వారి హాస్పిటల్ లైసెన్స్ లను రద్దుచేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా నాయకులు యు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నందికొట్కూరు లో  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు నవీన్ కుమార్  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండోదశ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు  యాజమాన్యం మొత్తం సిండకెట్ అయ్యి  కరోనా సోకినా వారివద్దనుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయిన పేషంట్స్ వద్దనుండి  మూడు లక్షలు  డిపాజిట్స్ కట్టాలి లేకపోలేతే మావద్ద బెడ్స్ కాలి లేవు అంటూ దందాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులను  ప్రతి హాస్పిటల్ యాజమాన్యం నోటీసు బోర్డులో తెలియజేయాలన్నారు. అదేవిధంగా టెస్టులో పేరుతో స్కానింగ్ సెంటర్ లో మూడు వందలు వసూలు చేయాల్సి ఉంటే మూడు వేల పైగా వసూలు చేస్తూన్నా  జిల్లా అధికారులు చోద్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు గాలికి వదిలి ఆరోగ్యశ్రీ పేషంట్ల వద్ద అధిక ఫీజుల వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఫైన్లతో సరిపెట్టకుండా వాటి గుర్తింపును రద్దుచేయాలన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద అడ్మిట్ అయిన ఏ ఒక్క పేషంట్ వద్ద ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని,  డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం - 2005 నిబంధనల వున్న  సంబందిత ఆస్పత్రుల యాజమాన్యం అక్రమాలకూ పాల్పడుతున్నా  జిల్లా వైద్య ఆరోగ్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం వెనుక వున్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్లకు పటిష్టంగా వైద్య సేవలు అందాలంటే  జిల్లాలోని కోవిడ్ వైద్యం అందించే అన్ని ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలి  అప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు మధు,  అఖిల్,వినోద్ మొదలైన వారు పాల్గొన్నారు.

 దెయ్యం గుడ్డిదైతే..!?

ట్రైలర్ ఆర్.జి.వి రిలీజ్ చేస్తే..?

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా ప్రతినిధి)

     యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వం.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్ "దెయ్యం గుడ్డిధైతే".

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వినూత్న కథాచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

       ఈ చిత్రం ట్రైలర్.. దెయ్యం చిత్రాల రూపకల్పనలో సిద్ధహస్తుడైన దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... "నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. ఆ తరహా చిత్రాలు లెక్కలేనన్ని చూశాను. కానీ... దెయ్యం సినిమాలో.. దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. దానిని హైలైట్ చేస్తూ... "దెయ్యం గుడ్డిదైతే" అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ సినిమా సాయిరామ్ దాసరికి దర్శకుడిగా మంచి పేరు తీసుకురావాలని విష్ చేస్తున్నాను" అన్నారు.

    దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. "సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మా "దెయ్యం గుడ్డిదైతే" చిత్రం ట్రైలర్ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

     సుమీత్-జాకీర్-హైమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: రాఘవ, ఎడిటర్: రంగస్వామి, స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డి ఐ: జానీ బాషా, ఆడియోగ్రఫీ 5.1: శ్రీమిత్ర, టైటిల్స్ & పోస్టర్స్ ప్రవీణ్  తమటం, సమర్పణ: సంధ్య స్టూడియో, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: సాయిరామ్ దాసరి!!


 

 కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి

తహసీల్లార్ కు వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

కరోనా బాధితుల సహాయార్థం అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యాచరణ-కోవిడ్ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని జగన్మోహన్ రెడ్డి  విజ్ఞప్తిహిందూపురం పట్టణంలోని అల్ హిలాల్ ప్రాంగణంలో ప్రస్తుత కోవిడ్ మహమ్మారి బాధితులను ఆదుకోవడం కోవిడ్ బాధితులకు బాసటగా నిలబడదాం అనే ఆచరణాత్మక కార్యాచరణ ను సిద్ధం చేశారు ఈ కార్యక్రమాన్ని ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షత వహించగా కన్వీనర్ గా ఆవాజ్ ఇంతియాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక జేశారు ప్రతిరోజు బాలాజీ మనోహర్ వారి కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించేలా కోవిడ్ బాధితులకు బాసటగా వారి కుటుంబానికి ఆదుకునే వారు నిత్యావసర వస్తువులు బియ్యము నూనె చక్కెర గోధుమ పిండి ఇంతియాజ్ ని సంప్రదించి చేర్పించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్. సంపత్.తెలుగుదేశం నాయకులు డీఈ. రమేష్.ఎం ఐ ఎం నాయకులు రియాజ్.లైఫ్ వరల్డ్ఉదయ్ కుమార్.చైతన్య గంగిరెడ్డి.టైలర్ యూనియన్ జబీ.సెల్ ఫోన్ యూనియన్ ఇబ్రాహీం. అల్ మదట్ ముజ్జు.బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు.ఆర్సీపీ నాయకులు శ్రీనివాసులు తదితరులు తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.






 

 పేదలకు రంజాన్ కిట్ల పంపిణీ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జమాఅతె ఇస్లామి హింద్, హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా పేదవారికి రంజాన్ ఇఫ్తార్ కిట్స్ లను పంచుతున్న విషయం విదితమే. అలాగే ఈ సంవత్సరం కూడా గురువారంనాడు స్థానిక పూల సుబ్బయ్య కాలనీలోని బిలాల్ మసీదు ఆవరణలో పేదవారికి లక్షా డెబ్భై వేల రూపాయల విలువ కలిగిన ఇఫ్తార్ కిట్స్ ఆరు వందల రూపాయల నిత్యావసర వస్తువులు మరియు 20 కేజీ ల బియ్యం వంద మంది పేదలు,  వితంతువులు,అవసరార్థులకు జమాఅతె ఇస్లామి హింద్ మార్కాపురం పట్టణ శాఖ ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నయీమ్ విచ్చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ నయీమ్ మాట్లాడుతూ జమాఅతె ఇస్లామి హింద్ ఆధ్వర్యం లో సామాజిక,ఆధ్యాత్మికత కార్యక్రమాలతో పాటు సంఘ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గర్హనీయమని పేదవారికి తోడ్పడే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహామండలి సభ్యులు అష్రాఫ్ అలీ,మజ్లిసుల్ ఉలేమా పట్టణ అధ్యక్షులు హాఫిజ్ సాదిఖ్, జమాఅతె ఇస్లామి హింద్ పట్టణ ఉపాధ్యక్షులు సికిందర్, కార్యదర్శులు న్యామతుల్లా,ఖాసిం బాష, ముహమ్మద్ ఖాన్, అజీజ్, కార్యకర్తలు నజ్మతుల్లా, హనీఫ్, షఫీ, అజీం, ఐవైయమ్ రాష్ట్ర సలహామండలి సభ్యులు అయూబ్ ఖాన్, ఐవైయమ్ పట్టణ అధ్యక్షులు ముజఫర్,యస్ఐఓ సభ్యులు ముహీం, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

 ఉష్ణోగ్రత పెరిగితే,,

కరోనా ఖేల్‌ ఖతం

(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

అధిక ఉష్ణోగ్రతల వద్ద కరోనా వైరస్‌ మనుగడ కొనసాగించలేదని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత దాటితే అది ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలోనే నిర్వీర్యమవుతుందని తెలిపారు. తాజా అధ్యయనంలో భాగంగా టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌లతో కూడిన ద్రావణాన్ని ఓ ఉక్కు గొట్టంలోకి పంపారు. ఆ ద్రావణాన్ని కేవలం అర సెకను పాటు 72 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు గురిచేసి.. వెంటనే చల్లబర్చారు. ఆ స్వల్ప వ్యవధిలో ద్రావణంలోని వైరస్‌ లోడు 10 వేల రెట్లు తగ్గినట్లు గుర్తించారు. అధిక ఉష్ణోగ్రతల్లో కరోనాకు మనుగడ కష్టమవుతుందన్న సంగతిని గతంలోనే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయని.. సెకను కన్నా తక్కువ సమయంలోనే దాని ఖేల్‌ ఖతం చేయొచ్చన్నది మాత్రం ఇప్పుడే నిరూపితమైందని శాస్త్రవేత్తలు తెలిపారు

  వైయస్సార్ జలకళ కార్యక్రమంలో,,,

పాల్గొన్న ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల పరిధిలో కలుజువ్వలపాడు పంచాయతీ పరిధిలో వైయస్సార్ జలకళ పథకం లో భాగంగా  200 బోర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం  మడమ తిప్పని నేత అనుకున్న లక్ష్యం సాధించేవరకు నిద్రపోడు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ఉన్నారు.

ఇలా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ కె శీనా రెడ్డి మాట్లాడుతూ ఈ క్లస్టర్ పరిధిలో  వైయస్సార్ జలకళ పథకం రైతులకు వరం లాంటిదని రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఎం డి ఓ ఎస్ నరసింహులు, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు, టి ఎ  కుందూరు అనిల్, మరియు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.








 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

దేశంలో రోజురోజుకు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో మే మొదటి వారంలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా వ్యాధి బారినపడిన విద్యార్థుల ప్రాణాలు పోతే వారి భవిష్యత్తు ఇంకేమి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు వాయిదా వేయలేదని మంత్రి వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నట్లు సయ్యద్ ముక్తార్ బాషా పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 విజృంభిస్తున్న కరోనా పంజా..

ఇక నుండి కఠిన ఆంక్షలు

ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి

మార్కాపురం ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో,  కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం శాసన సభ్యులు   కుందురు నాగార్జున రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి తీసుకోవలసిన చర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం పట్టణం లో వేగవంతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నoదున జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే హాస్పిటల్ లో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున మార్కాపురం పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా పరిషత్ బాలిక పాఠశాల లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే చెప్పారు.
మార్కాపురం డివిజన్ ఆర్.డి.ఓ. ఎమ్. శేషిరెడ్డి
మార్కాపురం లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో కూడా కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడాన్ని అధికారులు పరిశీలించడము జరిగిందన్నారు. మార్కాపురం పట్టణం లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్ద ఆయన కోరారు. మార్కాపురం పట్టణం లో వ్యాపా వర్గాలు ఇప్పటికే స్వచ్ఛందగా, మార్కెట్ షాపులను మూసివేస్తూ న్నారన్నారు. మార్కాపురం పట్టణం లో గత సంవత్సరము కంటె కోవిడ్ కేసులు 4 రేట్లు పెరిగాయన్నారు. మార్కాపురం పట్టణం లో రేపు శుక్రవారం వారం నుంచి ఉదయం6గంటల నుండి మధ్యాహ్నం1గంట వరకు మాత్రమే మార్కెట్లు, షాపులు తెరుచుకోవాలని ఆయన అన్నారు. మధ్యాహ్నం1 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు మార్కెట్లు, షాపులు మూసివేయాలని ఆయన తెలిపారు. ప్రజలు  కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు ఇంటి దగ్గరే ఉండాలని ఆయన చెప్పారు. ప్రజలు అందరూ సహకరించాలని ఆయన చెప్పారు. ముందుగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం కోవిడ్ కేర్ సెంటర్లు పరిశీలించారు. ఈ సమావేశంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీఎం. శేషి రెడ్డి, డి.ఎస్.పి కిషోర్ కుమార్,మార్కాపురం నియోజకవర్గ కోవిడ్ కేర్ సెంటర్ల  నోడల్ అధికారి సరళ వందనము,మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు,    వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 


 

 జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌ విచారణార్హమే

ఎంపీ రఘురామ వ్యాజ్యంపై సీబీఐ కోర్టు

త్వరలో ముఖ్యమంత్రికి నోటీసులు!

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

 అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు కార్యాలయ అభ్యంతరాలను సీబీఐ ప్రధాన కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు విచారణార్హత ఉందంటూ మంగళవారం స్పష్టంచేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందోలకు సంబంధించిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్‌ బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావు గత వారం విచారణ చేపట్టి వాదనలు విన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ విచారణార్హమేనని, దీనికి నంబరు కేటాయించి బెంచ్‌ ముందుంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నంబరు కేటాయించాక ఇందులో ప్రధాన నిందితుడైన జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.
సాధారణంగా బెయిలు రద్దు కోసం కోర్టు తనంతటతానుగా కానీ, దర్యాప్తు సంస్థ, ఫిర్యాదుదారు, సామాన్యుడు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని, ఇదే విషయాన్ని రాతినాం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. మూడో వ్యక్తి దరఖాస్తు చేశారన్న కారణంగా తిరస్కరించరాదని, బెయిలుకు సంబంధించిన సబ్‌సెక్షన్‌లో కేవలం ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ మాత్రమే బెయిలు రద్దుకు దరఖాస్తు చేయాలని చెప్పలేదని ఇదే విషయాన్ని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయని న్యాయవాది చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తూ న్యాయ ప్రక్రియకు గండికొడుతున్నారని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిలు రద్దు విషయంలో కోర్టు మొదట కేసు ప్రత్యేకత, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితులకు కీలకమైన పదవులు కట్టబెడుతుండటంతో వారు బెదిరించి భయపెట్టడం ద్వారా సాక్షులను తారుమారు చేయడానికి అవకాశం ఉందన్నారు. సాక్షులుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులే ఉన్నారని, ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణను ఆశించలేమని, అందుకే బెయిలు రద్దు చేయాలని విన్నవించారు. జగన్‌కు న్యాయ ప్రక్రియపై ఎలాంటి గౌరవం లేదని,. స్వల్ప కారణాలను పేర్కొంటూ 317 దరఖాస్తులను దాఖలు చేయడం ద్వారా గత ఏడాది కాలంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావడంలేదన్నారు. బెయిలు నిమిత్తం చేసుకున్న దరఖాస్తులో దర్యాప్తునకు, విచారణకు సహకరిస్తానంటూ హామీ ఇచ్చారని, ఇప్పుడు స్వల్ప కారణాలను పేర్కొంటూ కోర్టు విచారణకు సహకరించడం లేదన్నారు. ఇది కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారని, ఈ కారణంగా బెయిలును రద్దు చేయవచ్చని న్యాయవాది వివరించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

 ప్రాణాలు పోతుంటే అంతా సజావుగా ఉన్నట్లా

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

రాష్ట్రంలో ఒక్క రోజులో 10,122 కరోనా పాజిటివ్ కేసులు 52 మరణాలు సంభవిస్తే, రాష్ట్రములో కరోనా కేసులు అంతగా పెరుగడము లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడం శోచనీయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ సందర్భంగా జి.నిరంజన్ మాట్లాడుతూ...  ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్షిజన్ కొరత లేదని ప్రపంచములో ఎక్కడా లేని విధముగా విమానాలలో ఆక్షిజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నామని గొప్పలు చెప్పే బదులు ప్రవేట్ ఆసుపత్రులను నియంత్రించి ప్రజలు దోపిడీకి గురికాకుండా చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాదు, ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఎటువంటి కొరత, అసౌకర్యాలు కలుగకుండా చూడాల్సిన భాధ్యత ప్రభుత్వానిది. రాష్ట్రములో వెంటిలేటర్ బెడ్ల కొరత తీవ్రంగా ఉన్నది.ఆ కొరత లేకుండా చూడాలి. అసలుకు ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనే సమర్తతా ఈ ప్రభుత్వానికి ఉందా? అనే సందేహము కలుగుతుంది. ప్రజలను అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వము కె.సి.ఆర్ ప్రభుత్వము అని చెప్పే ఈటల ఎందుకు కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్పించలేక పోతున్నారో చెప్పాలి. ముఖ్య మంత్రి కె.సి.అర్ భజన తప్ప ప్రజల రోదనలు వినపడవా..? వాస్తవాలను అంగీకరించి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తము చేసి ప్రజలను ఆదుకోవాలి తప్ప ప్రజలను మభ్య పెట్టే ప్రకటనలు చేసి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 ఆక్సిజన్...మందులు అందుబాటులో ఉంచాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

కోవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ తోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. విజయనగరంలోని మహరాజు ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక, విశాఖపట్టణంలో కోవిడ్ బాధితులకు పడకలు అందక మరణించిన ఘటనలు చోటు చేసుకొన్నాయన్నారు. ఈ ఘటనలు విచారకరమన్నారు. ఈ సౌకర్యాల కల్పన దిశగా ఏపీ సర్కార్ శ్రద్ద పెట్టాలని ఆయన కోరారు.అత్యవసర ఔషదమైన రెమిడి సివల్, ఇతర మందులను ప్రైవేటు మెడికల్ షాపులో బ్లాక్  గా అమ్ముతున్నారని, దీనిపై ప్రభుత్వం చూసిచూడకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వేలకొద్ది అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని గొప్పలు చెపుకొనే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ బాధితులను ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడటంలో ఎందుకు విఫలమవుతోందని ఆయన ప్రశ్నించారు. ఆక్సిజన్ సరఫరాపై ఆడిట్ చేయించి అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా జరుపుకున్నారు. తెలంగాణ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. బంగారు తెలంగాణగా రూపొందించేందుకు పార్టీ చేపట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి అన్నారు. కుల, మత రాజకీయాల కతీతంగా తెలంగాణ అభివృద్ధికి తెరాస పార్టీ తీసుకుంటున్న చర్యలు అమోఘమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.


✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి