కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి ఖరారు 

ఎఐసిసి అధ్యక్షురాలి నిర్ణయం 

వేడెక్కిన సాగర్ ఉపఎన్నిక 

 


( జానో జాగో వెబ్ న్యూస్ - లీగల్ ప్రతినిధి)

 ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షరాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డిని బరిలోకి దించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా ప్రధాన కార్యదర్శి ముఖుల్ వాస్నిక్ వెల్లడించారు.  నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఏప్రిల్ 17 న రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేయడంతో జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున జానారెడ్డి గతంలో సాగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం విదితమే.

మరోవైపు తెలంగాణ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహం ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17వ తేదీన ఎన్నిక అదేవిధంగా మే 2న కౌంటింగ్ తేదీలను ఎన్నికల కమీషన్ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సైతం గెలుపు కోసం గట్టి పోటీ ఇచ్చేందుకు కృషి చేస్తోంది. త్రికోణపోటీ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం కోసం కృషి చేస్తున్నారు. ప్రచార పర్వం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కింది. సభలు, సమావేశాల ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చివరికి గెలుపు ఎవరి తలుపు తడుతుందో వేచి చూడాలి. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్ 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: