కౌంటింగ్  కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన...

మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ...నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కౌంటింగ్  కేంద్రాల ఏర్పాట్లను  నంద్యాల సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డిలతో కలిసి పరిశీలించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీలో  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను సహాయ ఎన్నికల అధికారి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డి.ఎస్.పి చిదానంద రెడ్డిలతో కలిసి  ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 14 వ తారీకు ఆదివారం 8 గంటల నుండి నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీ నందు  కౌంటింగ్  ప్రారంభం అవుతుందని,  అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయన్నారు. కౌంటింగ్ కొరకు 60 టేబుల్ లను వేసి రెండు విడతలలోనే  ముగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కౌంటింగ్ ప్రారంభంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తదనంతరము కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ఒక వార్డ్ లో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లయితే వాటన్నింటిని మిక్సింగ్ చేసి తదనంతరం కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు. కౌంటింగ్ నందు కూర్చోవడానికి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను త్వరగా ఇచ్చినట్లయితే వాడిని  స్క్రూటీనీ  చేసి ఏజెంట్లను నియమిస్తామన్నారు. అనంతరం డి.ఎస్.పి చిదానంద రెడ్డి మాట్లాడుతూ ఈనెల14వ తేదీ ఆదివారం పాలిటెక్నిక్ కాలేజీ నందు  మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ల కౌంటింగ్  జరుగనున్నదని,  మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత  వాతావరణంలో నిర్వహించామని, 
అదేవిధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ కూడా జరిగేలా పోలీస్ అధికారులకు,  సిబ్బందికి తగిన సూచనలు కూడా ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థులు వారి ఏజెంట్లు మాత్రమే రావాలని వారు వచ్చేటప్పుడు వారి వారి వాహనాలను టెక్ మార్కెట్ యార్డ్ నందు, స్టేడియం నందు పార్కింగ్ చేసుకొని రావాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్కింగ్ సౌకర్యం లేనందున  నిర్ణయించిన పార్కింగ్ కేంద్రాల వద్ద పార్కింగ్ చేసుకొని రావాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవాలు గాని గుంపులు గుంపులుగా వెళ్లడం గాని చేయరాదన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: