న్యాయవాదులపై దాడి హేయం
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి
ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టం తీసుకురావాలి
తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జి.జితేందర్ రెడ్డి డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
ఓ కేసుకు సంబంధించి ప్రత్యర్థి వర్గం వారు న్యాయవాదులు చంద్రశేఖర్, పరమేశ్వర్ రెడ్డిలపై దాడి హేయమైన చర్య అని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జి.జితేందర్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వము వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దాడికి గురైనా న్యాయవాది చంద్రశేఖర్
ఇటీవల వామన రావు, నాగమణి దంపతుల ఉందంతం మరవక ముందే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. నిందితులను పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని హెచ్చరించారు. ప్రస్తుతం సరైన సమయంగా భావించి చట్టాన్ని ఎర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టులో కేసులు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం న్యాయవాదులకు రక్షణ కరువైందని వాపోయారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: