భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు

డీసీసీ అధ్యక్షులు   లక్ష్మీ నరసింహ యాదవ్ 

డీసీసీ అధ్యక్షులు   లక్ష్మీ నరసింహ యాదవ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నంద్యాల పార్లమెంటు జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ తెలియ జేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలనీ, రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టిన బీజేపీ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా కిసాన్ ముక్తి మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలు సంయుక్తంగా రేపు శుక్రవారం  తలపెట్టిన భారత్ బంద్ కు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ శైలజానాథ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, కనుక ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని, అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జులు నాయకులను కార్యకర్తలను సమన్వయ పరుచుకుని మీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో బంద్ లో పాల్గొని భారత్ బంద్ ను విజయవంతం చేయాలని నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్  తెలియజేశారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: