ఘనంగా....వైయస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని తుమ్మలచెరువు గ్రామం నందు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ షేక్ రసూల్ షాజహాన్ వైయస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి కేక్ కట్ చేసి కార్యకర్తలు కు తినిపించారు. ఈ సందర్భంగా తుమ్మల చెరువు గ్రామం ఎస్సీ పాలెం  కు  చెందిన పెరికె. దానం గత వారంలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతనిని   గ్రామ సర్పంచ్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు ఎస్ డి ఖయ్యుం, షేక్ బాజీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: