పలుచోట్ల శంకుస్థాపన చేసిన,,

  ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో16కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని మార్కాపురం శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి వెల్లడించారు. సోమవారం మార్కాపురం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో80 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ను నిర్మించడానికి ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు.

మార్కాపురం ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి

ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం పట్టణం లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.అభివృద్ధి పనులు చేయడానికి టెండర్లు పిలవడం జరిగిందన్నారు. మార్కాపురం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పట్టణ సమీపంలో ఆర్.డి.ఓ కార్యాలయ ప్రాంగణంలో 80లక్షల రూపాయల తో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

మార్కాపురం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం పట్టణంలోని కోనేటి బజార్ లో సిమెంటు రోడ్లు,సైడ్ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళి కృష్ణ,వైస్ చైర్మన్ షేక్. ఇస్మాయిల్, మున్సిపల్  కౌన్సిలర్ చెప్పలి కనకదుర్గ,సిరాజ్, నాలి కొండయ్య, దొడ్డా భాగ్యలక్ష్మి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మార్కాపురం డివిజన్ ఆర్.డి.ఓ. ఎమ్. శేషిరెడ్డి
మార్కపురం మునిసిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాల మురళీ కృష్ణ
మార్కాపురం మునిసిపల్ వైస్ ఛైర్మన్ షేక్. ఇస్మాయిల్

 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: