మీకు బ్యాంకుతో పనివుందా...?

అయితే త్వరగా చక్కబెట్టుకోండి 

త్వరలో వరుస సెలవులు

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ ప్రతినిధి)

ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుతో లావాదేవీలు నడపని వారి ఉండరు. అందుకే అలాంటి వారి కోసమే ఈ సమాచారం. ఎందుకంటే ఏ పండగొచ్చిన మనకు బ్యాంకుతో లావాదేవీలు నడపటం కష్టం. మరి వరుసగా సెలవులొస్తే మరి. అందుకే మీ కోసమే హెచ్చరికపూరితమైన సేవా సమాచారం ఇది. మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. లేకపోతే మీరు బ్యాంకు పనుల కోసం ఏప్రిల్ 3 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకు కార్యాలయము పనిచేస్తాయి. కాబట్టి, బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. మార్చి 27న చివరి శనివారం, మార్చి 28న ఆదివారం, మార్చి 29న హోలీ పండుగ ఇలా మూడు రోజులు వరుస సెలవులు ఉన్నాయి. తర్వాత మార్చి 30న పాట్నాలో హాలిడే ఉంది. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు. అలాగే ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండవు. బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్ పనిలో ఉంటాయి. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పని చేయవని చెప్పుకోవచ్చు. దీని వల్ల మీకు బ్యాంకులో పని ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ నెలలో చాలా సెలవులు వచ్చాయి. మార్చి 15-16 తేదీలలో బ్యాంకుల ప్రైవేటీ కరణకు నిరసనగా రెండు రోజులు పాటు బ్యాంకులు పనిచేయలేదు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: