అంతరాలను అధిగమించే అంతరంగుల హోళి
-అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
హోళి పండుగను పురస్కరించుకుని నేడు ఆదివారం రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో "ఆనందాల హోళి" చిత్రాలను ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. అతను మాట్లాడుతూ "హోళీ హోళీలరంగా హోళీ చెమ్మకేళిల హోళి" "రింగు రింగు పిల్లా రూపులదండా, దండగాదురా దామరమొగ్గా" గోగులుపుచే గోగులుగాచే ఓలచ్చగుమ్మడి గోగిపువ్వుతెచ్చి రంగుచేసిపూస్తా ఓలచ్చగుమ్మడి" పండుగలు జనచైతన్యాన్ని ఆట పాటలద్వారా సంస్కృతిని జాగృత పరుస్తాయని సహజీవనాన్ని పెంపొందించి శోభాయమానంగా తీర్చిదిద్దుతాయని, అంతరాలను అధిగమించే అంతరంగుల భాహ్యపండుగ రంగుల హోళి,సహజీవన సౌందర్యానికి ప్రతీక అని, ప్రేమానురాగాలు సమత మమత ఆప్యాయతలు పెంపొందించి సుఖసంతోషాలతో ప్రపంచ నలుమూలల్లో ఐక్యతను చాటుతాయని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాంక్షిస్తూ హోళీ కలర్ఫుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటపాటల ఆత్మీయతే తెలంగాణపండుగలు. ప్రభుత్వం కరోనా దృష్ట్యా గుంపులు గుంపులుగా కెమికల్ రంగులు వాడకుండ వాడవాడలా తిరగకుండా, ప్రకృతి రంగులతో ప్రతి ఇంట్లో అనందాలను పంచుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఏ. ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం,నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, మెహరాజ్బేగం, తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: