"ఐశ్వర్యకు తోడుగా అభిరామ్"తో

అరంగేట్రం చేస్తున్న "యష్ రాజ్"

 (జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

      సినిమా రంగం ఓ పుష్పక విమానం వంటిదనే విషయం తెలిసిందే. ఎంతమంది ఎక్కినా.. అందులో ఒక సీటు ఖాళీగానే ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ కొంత ఉపయోగపడే అవకాశమున్నప్పటికీ...

ప్రతిభే అందుకు ప్రధాన ప్రాతిప్రదిక. 

కథానాయకుడిగా తెలుగు సినిమా రంగంలో నాలుగు కాలలపాటు అలరారేందుకు అన్ని అర్హతలు సంపాదించుకుని... తెరంగేట్రం చేస్తున్నాడు కత్తి లాంటి కొత్త కుర్రాడు "యష్ రాజ్".

     యష్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తున్న ఆ చిత్రం పేరు "ఐశ్వర్యకు తోడుగా అభిరామ్". దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రతిభాశాలి రామకృష్ణార్జున్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... మహేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై స్వర్గీయ ఎన్.సి.ఎస్.రాయుడు దివ్యాశీస్సులతో శ్రీమతి సరస్వతి వెంకటేష్.ఎన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

     యష్ రాజ్ సరసన "నాంది"  ఫేమ్ నవమి గాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో "బాహుబలి" ప్రభాకర్, శివబాలాజీ, తులసి, అన్నపూర్ణమ్మ, రఘుబాబు, వై.విజయ, నవీనారెడ్డి, కాదంబరి కిరణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు తెరపై ఇంతవరకు రాని అత్యంత వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణకు సన్నాహాలు చేసుకుంటోంది.

     సుమన్ శెట్టి, విజయ్ రంగరాజు, గౌతంరాజు, జబర్దస్త్ శేషు, జూనియర్ రేలంగి, అంబటి శ్రీను, కిషోర్ దాస్, శశాంక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కో-డైరెక్టర్: మడుత శివకుమార్, పోరాటాలు: వించన్ అంజి, నృత్యాలు: చంద్ర కిరణ్,  పాటలు: సాగర్ నారాయణ్.ఎం, సంగీతం: మీనాక్షి భుజంగ్, ఛాయాగ్రహణం: కొమరి జగదీష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఉల్లగంటి ప్రసాద్, సమర్పణ: ఎన్.సి.ఎస్.రాయుడు, నిర్మాత: సరస్వతి వెంకటేష్.ఎన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: 

రామకృష్ణార్జున్!!


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: