ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన,,,

నూతన మునిసిపల్ ఛైర్మెన్ మాబున్నిసా

ఎంపీని కలిసిన ఛైర్మెన్ మాబున్నిసా దంపతులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

నంద్యాల నూతన మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా శుక్రవారం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సాయిబాబా నగర్లోని ఎంపీ నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛంను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారిగా నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా మైనార్టీలకు అవకాశం కల్పించారని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నంద్యాలను అభివృద్ధి పదంలోకి తీసుకొని రావాలన్నారు. చైర్మన్ మాబున్నిసా మాట్లాడుతూ చిన్నవయసులోనే కో ఆప్షన్ పదవి చేయడంతో పట్టణ సమస్యలపై అవగాహన వచ్చిందన్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి నాపై నమ్మకంతో ఛైర్మెన్ పదవి ఇచ్చారని, వారి  నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పట్టణంలోని 42 వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రికి, స్థానిక నేతలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: