ఆత్మకూరు అగ్రగామిగా తీర్చిదిద్దుతా

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి 

పదవి అంటే కుర్చీ కాదు.. బాధ్యత.... శిల్పా కార్తీక్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆత్మకూరును అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. 24 వార్డులకు 23 వార్డ్ లు వైసీపీకి ఇచ్చిన ఆత్మకూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా కొలువు దీరిన కౌన్సిల్ సభ్యుల సన్మాన సభలో ప్రసంగిస్తూ ఎన్నికలు జరగక ముందే వైసీపీ గెలుచుకున్న 5 ఏకగ్రీవం మున్సిపాలిటీల్లో ఆత్మకూరు ఒకటన్నారు. ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ లో రాష్ట్రం అంతటా 1 సెంటు స్థలం ఇస్తే ఇక్కడ మాత్రమే 1.5 సెంట్లు ఇచ్చామన్నారు. షాదీఖానాకు మంజూరు అయిన నిధుల విషయంలో టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసి అభాసు పాలయ్యారన్నారు.వాట్సాప్ ద్వారా నిరంతర నిఘా పెట్టి ఆత్మకూరులో పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తున్నట్టు గుర్తు చేశారు.  చైర్మన్ గా ప్రమాణం చేసిన డా ఆసియా మారుఫ్ బహుశా రాష్ట్రంలోనే పిన్న వయస్కురాలని, ఆత్మకూరు అభివృద్ధికి కష్టపడి తాను ఏమిటో నిరూపించుకోవాలన్నారు.  డాక్టర్  ఆసియాకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.

పదవి అంటే కుర్చీ కాదు.. బాధ్యత.... శిల్పా కార్తీక్

వైసీపీ యువ నాయకులు శిల్పా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ పదవి అంటే కుర్చీ కాదు, ఒక బాధ్యత అని తెలుసుకొని కష్టపడితే రాజకీయం గా రానిస్తారు అన్నారు.  తన తండ్రి గారు అయిన ఎమ్మెల్యే శిల్పా ఆత్మకూరు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారు అని, శిల్పన్న అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అని ఋజువు చేశారన్నారు. దెబ్బ కొడితే మళ్ళీ లేయ్యకుండా కొట్టాలి అన్న సామెత నిరూపిస్తూ ఆత్మకూరు లో 24 కు 23 వార్డులు గెలిపించారని వ్యాఖ్యానించారు. కొత్త చైర్మన్ డా ఆసియానుద్దేశించి మాట్లాడుతూ విద్యావంతురాలవు కాబట్టి ఎమ్మెల్యే గుర్తించి మీకు ఈ అవకాశం ఇచ్చారని, కష్టపడి పనిచేసి ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేసి ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.

 


శిల్పన్న స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చా...

డా ఆసియా మారుఫ్

నియోజకవర్గం అభివృద్ధికి అలుపెరుగకుండా కష్టపడుతున్న ఎమ్మెల్యే శిల్పన్న స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చినట్లు చైర్మన్ డా. ఆసియా మారుఫ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఆత్మకూరును అభివృద్ధి చేస్తానని తెలిపారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: