ఘనంగా ముగిసిన కోడంగల్ బ్రహ్మోత్సవాలు

శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామీ వార్షిక జాతర వేడుకలు

చక్ర స్నానంతో పూర్తయిన బ్రహ్మోత్సవాలు 

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

కొడంగల్ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం చక్ర స్నానం కార్యక్రమంతో లు ఘనంగా ముగిశాయి. అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఆగమశాస్త్ర పద్దతి ప్రకారం ద్వజా అవరోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ శాశ్వత ధర్మకర్తల ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

"" గరుడోత్సవం "" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. లంకాదహనం భక్తులను అలరించింది. బాణసంచా వెలుగుల్లో కన్నుల పండువగా ముగిసింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీరోజూ ఉయ్యాల సేవ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేదీప్యమానంగా రంగు రంగుల లైట్లతో దేవాలయాన్ని అలంకరించారు. పూలమాలలతో ముస్తాబు చేశారు. 
 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: