రంగుల కేళీ రంగోలి "హోలీ"
చిన్నా...పెద్ద...వయస్సును పక్కనెట్టి
సంబరాలు చేసుకొన్న దేశం
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
దేశమంతటా రంగుల పండుగ " హోళీ " సంబరాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఒకరి కొకరు రంగులు పోసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మరోసారి కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచనలు కూడా జారీ చేశారు.
గుంపులు గుంపులుగా జనం గుమిగూడి ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో రాక పొకలు నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, పూణే, పంజాబ్ ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కర్ఫ్యూ విధించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హోళీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు ప్రకటించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు
న్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: