మార్కాపురంలో భక్తిశ్రద్దలతో మహాశివరాత్రి

శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

        మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ప్రముఖ శివ క్షేత్రాలలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు “ హరహర మహాదేవ శంభో శంకర అనే నామంతో, నినాదాలతో శివనామస్మరణతో శివ క్షేత్రాలు మారుమోగాయి.  మాఘమాసం బహుళ చతుర్ధశి నాడు ఆదిదేవుడు లింగో దారుడిగా అవిర్భవించిన, ప్రపంచంలో మొట్టమొదటిగా ఆది దంపతుల కళ్యాణం జరిగిన రోజునే శివరాత్రిగా పేరొందింది.

ఈ మహా శివరాత్రి శుభ పర్వదిన సందర్భంగా ప్రకాశం జిల్లా,  రాచర్ల మండలము చోళ్ళవీడు గ్రామమునకు సమీపములో గల కనక సురభేశ్వరి స్వామి దేవస్థానం నందు శివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయములో శివయ్యకు అభిషేక కార్యక్రమాలు. శివాలయాలన్నీ మహాశివరాత్రి సందర్భంగా గురువారం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యుల  ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచే అభిషేక కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గుట్టపైకి చేరుకొని పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిరీక్షించారు తదనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ  సభ్యులు నిర్వహించారు అలాగే శివాలయం వద్ద కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే   ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు చివరిగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పరిసరప్రాంత ప్రజలు పాల్గోన్నారు.  

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్ బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: