అభివృద్ధికి నా వంతు కృషిచేస్తా

వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్

భాద్యతలు స్వీకరిస్తున్న వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

 నంద్యాల పట్టణ అభివృద్ధికి నా వంతు కృషిచేస్తానని మున్సిపల్ వైస్ ఛైర్మెన్ గంగిశెట్టి శ్రీధర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన వైస్ చైర్మన్ గా  బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణ, కౌన్సిలర్లు విజయ భాస్కర్, కౌన్సిలర్ పురందర్, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఇషాక్ బాష పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడానికి కృషిచేస్తానని అన్నారు. నా విజయానికి కారకులైన అందరికి ధన్యవాదాలు తెలిపారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: