ఆదర్శ మున్సిపాలిటీగా  తీర్చిదిద్దుకుందాం

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

- మార్కెట్ వేలాలు వాయిదా  వేస్తూ నిర్ణయం

- 2గంటలు ఆలస్యంగా ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం 


మాట్లాడుతున్న ఎమ్మెల్యే

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా  తీర్చిదిద్దుకుందామని నంద్యాల ఎమ్మెల్యే, మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో నంద్యాల పురపాలక సంఘం తొలి కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అధ్యక్షతన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, చైర్మన్ షేక్ మాబునిసా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఆవిర్భవించిన ఈ కౌన్సిల్ నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లోని ప్రజల కలలను నెరవేర్చి నంద్యాల పట్టణం అభివృద్ధి పథం వైపు నడిపించుకుందామన్నారు.

మాట్లాడుతున్న కమిషనర్ వెంకట కృష్ణ

రానున్న రోజుల్లో నంద్యాల కాబోయే జిల్లా అని, అందుకొరకు మనమందరము కార్పొరేట్ స్థాయిలో నంద్యాల పట్టణాన్ని  అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లాలని కౌన్సిలర్లతో అన్నారు. నంద్యాల పట్టణాన్ని కోవిడ్19 అతలాకుతలం చేసిందని కొన్ని కుటుంబాల యజమానులు కూడా  కోవిడ్ కు బలైపోయారని, కోవిడ్ విపత్తుల సమయంలో నంద్యాలలోని ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు,  పోలీసులు, మున్సిపల్ శాఖ,  రెవిన్యూ వారు ప్రాణాలు వడ్డీ విధులు నిర్వహించి కోవిడ్ ను అరికట్టే ప్రయత్నం చేశారన్నారు. అందుకే అందరికీ ధన్యవాదాలు తెలిపారన్నారు. నంద్యాల పట్టణంలో కొత్త కౌన్సిల్ ఏర్పడిందని ఇకనుంచి కోవిడ్ ను అరికట్టడంలో కౌన్సిలర్లు ముందుండి నడిపించాలన్నారు.

 

సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు

పట్టణంలో వర్షం వచ్చిందంటే రోడ్డుపైన నీళ్లు పారుతాయని, వీటన్నిటికీ మనము మన ప్రజలే ఇబ్బందులు చేసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి కౌన్సిలర్ వారి వారి వార్డులో ప్రజల సహకారంతో మురికి కాల్వల యందు చెత్తా చెదారం వేయకుండా మురుగు కాలువలను దురాక్రమణకు లోను కాకుండా చూసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మన కౌన్సిలర్లు అందరూ బాధ్యతతో విధులు నిర్వహించి నంద్యాల  పట్టణ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మన నంద్యాల పట్టణానికి గతంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో123 వ ర్యాంకు వచ్చిందని కానీ ఇప్పుడు ఆ ర్యాంకు రెండంకెల వరుసలోకి తీసుకు రావాలన్నారు. మన నంద్యాల మున్సిపాలిటీలోకి ఆరు గ్రామాలు విలీనమయ్యాయని, వాటిని కూడా అభివృద్ధి పథం వైపు నడిపించుకుంటూ నంద్యాలలో ఒక భాగంగా చేసుకుందామన్నారు.

కరపత్రాల విడుదల

వచ్చే వేసవి కాలంలో నంద్యాలలో త్రాగు నీటి కొరత లేకుండా చూసుకోవలసిన బాధ్యత  మునిసిపాలిటీ, కౌన్సిల్ పై ఉందన్నారు. అందుకొరకే వెలుగోడు రిజర్వాయర్ నుండి నంద్యాలకు నీటిని తీసుకొని వచ్చే పైపులైన్ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. అందరమూ కలిసి పని చేద్దాం నంద్యాలను అభివృద్ధి పథంలో నడిపించుకుందామన్నారు.

మాట్లాడుతున్న చైర్మన్ మాబునిసా

నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ మాబునిసా  మాట్లాడుతూ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కొత్తగా ఎన్నిక కాబడిన కౌన్సిలర్ల అందరమూ కలిసికట్టుగా పనిచేసి నంద్యాలను అభివృద్ధి పథం వైపు నడిపిద్దామన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ నంద్యాల నినాదంతో నంద్యాల పట్టణమును సర్వ సుందరంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొందామన్నారు. బొమ్మలసత్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద  స్థలాలు దురాక్రమణ కాకుండా చూడాలని కమిషనర్ కు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి ద్వారా కార్యకలాపాలు జరిగాయని,  ప్రస్తుతం కొత్త కౌన్సిల్ రావడం చేత ఇకనుండి పురపాలక సంఘ అధ్యక్షురాలు పురపాలక సంఘ ఎక్స్ అఫీషియో సభ్యులు, కౌన్సిలర్ల ద్వారా పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం  జరుగుతున్న పనులన్నింటినీ అజెండా రూపంలో కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుందని, కౌన్సిల్ అనుమతులు తీసుకున్న తర్వాత కార్యకలాపాలు ప్రారంభం ఇస్తామన్నారు నంద్యాల పట్టణంలో కౌన్సిలర్లు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వార్డులోని ప్రజలు ఎస్ఎంఎస్ నినాదం అంటే ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ ఎం అంటే మాస్క్,  ఎస్ అంటే శానిటైజర్ లేదా సబ్బునీటితో చేతులు శుభ్రపరచుకోవడం అని అర్థమన్నారు.

పాల్గొన్న చైర్మన్, ఎమ్మెల్యే లు

నంద్యాల పట్టణాన్ని సుందరంగా, ఆరోగ్యవంతంగా,  తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం చేస్తున్న కృషిలో ప్రజలందరూ తమ సహకారాన్ని అందించాలని,  పరిసరాల పరిశుభ్రత- మన ఆరోగ్యానికి భద్రత కావున ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బుట్టల విధానం అమల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాటికి డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్  విగ్రహ నవీకరణ, పరిసర ప్రాంతాలను సర్వ సుందరంగా తీర్చిదిద్ది కౌన్సిల్ వారితోనే ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పరిశుభ్రతపై మున్సిపల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాక నంద్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా పరిసరాలను అశుభ్రత చేసిన యెడల వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో మున్సిపల్ దుకాణాదారులు తొమ్మిది నెలల అద్దెను మాఫీ చేయాలని కోరుకున్నారని అందుకు గాను కౌన్సిల్ వారి సూచన మేరకు వారు కోరిన విధంగా నాలుగు నెలల అద్దెను మాఫీ చేయుటకు అజెండాను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ప్రస్తుతం 5  అర్బన్ హెల్త్  కేంద్రాలు నడుస్తున్నాయని, దీనికి తోడుగా ప్రభుత్వం వారు 3 అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేశారన్నారు.  అనంతరం  ప్రభుత్వము ప్రవేశపెట్టబోయే మూడు బుట్టల విధానంపై  కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్  వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ డీఈ లు  జయభారతిరెడ్డి, మధు,  మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: