మీ ఆరోగ్యమే మాకు రక్ష...!

సద్భావన ఫోరం ఆధ్వర్యంలో టోపీల అందజేత

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఎడ, వాన, చలి ఇవేమీ లెక్కచేయకుండా మా వీధులన్నీ మీరు శుభ్రం చేస్తున్నారు. పారిశుద్ధ్యంతో మాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న మీ ఆరోగ్యమే మాకు రక్ష అంటూ సఫాయి కార్మికులకు టోపీలు పంపిణీ చేశారు. పహాడీ షరీఫ్ సద్భావన ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండ తీవ్రత రోజురోజుకూ మితిమీరిపోతుంది.

ఎండ వేడిమినుంచి పారిశుద్ధ్య కార్మికులను కాపాడేందుకు పహాడీ షరీఫ్ సద్భావన ఫోరం అధ్యక్షులు నరేంద్ర జమాఅతె ఇస్లామీహింద్ అక్కడి స్థానిక నాయకులతో కలిసి టోపీలు అందించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం ఆరగించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. పారిశుద్ధ్యం పాటించడమూ ఇస్లామ్ ధార్మిక విశ్వాసంలో భాగమేనని ప్రముఖ తెలుగు ప్రసంగీకులు అబ్దుర్రషీద్ అన్నారు. ఈ సమావేశంలో ముస్లిమ్ నాయకులు సాజిద్ అల్వీ తదితరులు పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-ముహమ్మద్ ముజాహిద్


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: