క్రీడాకారులకు టీ షర్ట్స్, షార్ట్స్ పంపిణీ చేసిన,,,

కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ 

టీ షర్ట్స్ పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్, ఆయన సతీమణి వాణి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, నంద్యాల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 12 వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్, ఆయన సతీమణి వాణి చేతుల మీదుగా క్రీడాకారులకు టీ షర్ట్స్, షార్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ వ్యాయామశాల నిర్వాహుడు పుల్లయ్య శిక్షణలో పవర్ లిఫ్టింగ్లో 35 మంది శిక్షణ పొందారని, విశాఖపట్నంలో ఏప్రిల్ 2, 3 తేదీల్లో జరిగే జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్తున్న పిల్లలకు కౌన్సిలర్ శ్యామ్ టీ షర్ట్స్ పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.
కౌన్సిలర్ శ్యామ్ మాట్లాడుతూ వ్యాయామశాల నిర్వాహుడు పుల్లయ్య చేస్తున్న సేవలు గొప్పవని, ఏ సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భింగుమల్ల శ్యామ్, ఆర్యవైశ్యుల హక్కుల సాధన సమితి అధ్యక్షులు జే. వి.సి.ప్రసాద్, కశెట్టి చంద్రశేఖర్, సుబ్బారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: