రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో,,,

పతకాలు సాధించాలి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా బ్యూరో)

రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పతకాలు సాధించాలని బనగానపల్లె తాసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్, డిప్యూటీ తాసిల్దార్  హుస్సేన్, నెరవాటి స్కూల్స్ చైర్మన్ రోహిత్ లు అన్నారు. మంగళవారం నంద్యాలలోని  నెరవాటి స్కూల్ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఎంపిక పోటీలకు  ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు ఈనెల 20 నుండి 22 వరకు జరిగే  రాష్ట్రస్థాయి  సబ్  జూనియర్ షూటింగ్  బాల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు పట్టణంలో జిల్లా  క్రీడాకారులు పాల్గొని  రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షూటింగ్ బాల్  సంఘం కార్యదర్శి బి ఈశ్వర్ నాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి నవీన్, పీఈటిలు  రాజు, రామ సుబ్బారెడ్డి, దివాకర్ నాయుడు, నరేష్, రాజేష్ , శ్రీను, హరి తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: