నడి వేసవి

రానున్న మూడు రోజులు భగభగలే

సీమకు మాత్రం చల్లని కబురు

(జానోజాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

అబ్బా ఏమి ఎండా...ఇపుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇంతవరకు బాగున్నా మరో మూడు రోజులు మాత్రం డెంజర్స్ బెల్ ను మోగిస్తున్న వాతావరణ శాఖ ఓ సూచన చేసింది. ఆ సూచన ప్రకారం రాష్ట్ర ప్రజలు తమ పనులను కాస్త పొద్దుపొద్దునే గానీ సాయంత్రం గాని పెట్టుకొంటే మంచిదన్నది దానర్థం. ఎందుకంటే రానున్న మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరగనుందని, సాధారణం కంటే, రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
ఉత్తరాది నుంచి తేమగాలులు వీస్తున్నాయని, ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడిగాలులతో అధిక పీడనం ఏర్పడి, ఎండలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు నడి వేసవిని తలపిస్తూ, 40 డిగ్రీలను దాటవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇదే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నెలాఖరులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: