ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి విమానాశ్రయంలో,,
విమానాల రాకపోకలు ప్రారంభం
ప్రారంభించిన మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ఈ నెల 25 వ తేదీన కర్నూలు జిల్లా ఓర్వకల్ లోని ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించి, ఆ ఎయిర్ పోర్ట్ కు చరిత్రకారుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పేరు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఉయ్యాలవాడ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు అధికారికంగా విమాన రాకపోకలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,
నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ పక్కీరప్పతో పాటు పలువురు సంబంధిత అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. మొదటిగా బెంగుళూరు నుండి విమానం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ప్రయాణికులు ఉత్సాహంగా చేరుకున్నారు. అనంతరం విమానాల రాకపోకలు కొనసాగాయి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: