దౌర్జన్యంగా ఆశీలు వసూలు

ఇది చట్ట వ్యతిరేకం

ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా 

విలేకరులతో మాట్లాడుతున్న ఆసిఫ్ పాషా 

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

సరుకు రవాణా చేసే ఆటోలు, మినీ వ్యాన్ ల నుంచి ఆశీలు వాసులు చేయకూడదని ప్రభుత్వ ఉత్తర్వలు, హైకోర్టు ఆదేశాలు ఉన్న, పంచాయతీలు, మునిసిపాలిటీల్లో దౌర్జన్యంగా ఆశీలు వసూలు చేస్తున్నారని హెచ్ఎంసీ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా అన్నారు. జవహర్ ఆటోనగర్ మొదటి క్రాస్ రోడ్ లోని హెచ్ఎంసీ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలోని  ఏ ప్రాంతానికి వెళ్లిన గూడ్స్ ఆటోల నుంచి 100 నుంచి 150  రూపాయల వరకు ఆశీలు వసూలు చేస్తున్నారని తెలిపారు.  కిరాయికి  వెళితే తమకు రోజుకు మిగిలేది 400 వందల రూపాయలేనని, అందులో 150 రూపాయలు ఆశీలు చెల్లిస్తే 250 రూపాయలే మిగులుతున్నాయని, కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, టోల్ టాక్స్ అన్ని పోను మిగిలిన నాలుగువందల రూపాయల్లో ఆశీలు చెల్లిస్తే తమకు మిగిలే డబ్బులు కుటుంబ పోషణకు, బండి కిస్తీలకు సరిపోవడం లేదన్నారు. ఆశీలు వసూలు చేయకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్న, దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని, పోలీసులను కూడా మేనేజ్ చేస్తున్నారని పేర్కొన్నారు.  ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన సర్కులర్ గురించి డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలోని పోలీసులందరికి తెలియజేయాలని,  పోలీసులు  సహకారం అందించాలని  కోరారు. ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామా పంచాయితీల్లో రోజుకు 200 నుంచి 300  సరుకు రవాణా వాహనాల నుంచి దౌర్జన్యంగా ఆశీలు వసూలు చేస్తున్నారన్నారు. ఎవరైనా ఆశీలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలనీ  ప్రభుత్వం పది ఫోన్ నంబర్లు ఇచ్చిన అవి పని చేయడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరారు. టోల్ గేట్ చార్జీలు కూడా యాప్లలో ఎక్కువగా కట్ అవుతోందన్నారు. కృష్ణా జిల్లా లారీ యజమానులు సంఘం వర్కింగ్ కమిటీ మెంబెర్ చినబాబు మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి దారుల నుంచి మాత్రమే ఆశీలు వసూలు చేయాలనీ, సరుకు రవాణా వాహన యజమానులు నుంచి కాదని సర్కులర్ ఉందన్నారు. కానీ చట్ట విరుద్ధంగా, రౌడీయిజంగా, దౌర్జన్యం చేసి ఆశీలు వసూలు చేస్తున్నారని  అన్నారు. ప్రభుత్వం స్పందించి  మళ్ళి కొత్త సర్కులర్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో హెచ్ఎంసీ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, పాతూరి సురేష్ బాబు, ఆరిఫ్, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: